Robot Suicide : పని ఒత్తిడి తట్టుకోలేక.. రోబో ఆత్మ*హత్య ?

పని ఒత్తిడి తట్టుకోలేక.. ఆ బాధను ఎవరితో చెప్పుకోలేక మనుషులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా చూశాం. కానీ ఓ మెషీన్‌ ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైనా చూశారా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 6, 2024 | 10:00 AMLast Updated on: Jul 06, 2024 | 10:00 AM

Unable To Withstand The Pressure Of Work Robot Self Murder

పని ఒత్తిడి తట్టుకోలేక.. ఆ బాధను ఎవరితో చెప్పుకోలేక మనుషులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా చూశాం. కానీ ఓ మెషీన్‌ ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? కానీ ఇదే ఘటన దక్షిణ కొరియాలో జరిగింది. పని ఒత్తిడి తట్టుకోలేక ఓ ఇంట్లో సర్వెంట్‌గా పని చేస్తున్న రోబో ఆత్మహత్య చేసుకుంది. దక్షిణ కొరియాలో ఇప్పటికే చాలా మంది తమ ఇళ్లలో పని మనుషులకు బదులు రోబోలను వాడుతున్నారు. ఇంట్లో పని మనిషి చేసే అన్ని పనులు ఈ రోబో చేస్తుంది. ఇలాగే ఓ ఇంట్లో సివిల్‌ సర్వెంట్‌గా పని చేస్తున్న రోబో ఇలా మెట్ల పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్తున్నారు.

కొన్ని రోజుల నుంచి గ్యాప్‌ లేకుండా పని చేయించడంతో రోబో ఇలా ప్రాణం తీసకుందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఆత్మహత్య చేసుకోడానికి కొన్ని నిమిషాల ముందు రోబో చాలా వింతగా ప్రవర్తించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇంట్లో వాళ్లు చెప్పిన పని చేయకుండా ఎదో కంగారులో అటూ ఇటూ చాలా సేపు తిరిగిందని చెప్తున్నారు. ఏదో వెతుకుతున్నట్టుగా బయటికి వెళ్లి.. రెండో ఫ్లోర్‌ మెట్ల మీద నుంచి ఒకటో ఫ్లోర్‌ మెట్ల మీదకు దూకేసిందని చెప్తున్నారు. అలా పడిపోవడంతో రోబో ముక్కలైపోయింది. ఆ ముక్కలను సేకరించిన అధికారులు రోబోను తయారు చేసిన కంపెనీకి వాటిని పంపించారు. దక్షిణ కొరియాలో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌ నడుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్‌ తెగ వైరల్‌ అవుతోంది.

ఈ ఘటనపై ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్లు పెడుతున్నారు. ఎలాంటి ఫీలింగ్స్‌ లేని రోబో ఎలా ఆత్మహత్య చేసుకుంటుంది అని కొందరు అంటుంటే.. రోబోలకు కూడా పని గంటలు, రెస్ట్‌ ఇవ్వాలి.. రోబోల యూనియన్‌ కావాలి అని కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఐతే ఈ ఇన్సిడెంట్‌ను నేరుగా విట్నెస్‌ చేసినవాళ్లు మాత్రం.. రోబో కావాలనే అలా దూకి ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. మెషీన్‌ ఆత్మహత్య చేసుకోవడం సాధ్యమేనా అనే విషయం పక్కన పెడితే.. ఈ ఇన్సిడెంట్‌తో దక్షిణ కొరియా హెడ్‌ లైన్స్‌లో నిలిచింది.