Uttarakhand Tunnel : ఉత్తరాఖండ్ టన్నెల్ 6 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్.. ఇంటర్నేషనల్ రెస్క్యూ టీం వచ్చిన రక్షణ చర్యల్లో కనిపించని పురోగతి
ఇంకా టన్నెల్ లోనే 40 మంది కార్మికులు.. 6 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్.. రెండు నిలిచిపోయిన రెస్క్యూ ఆపరేషన్. థాయ్‌లాండ్ రెస్క్యూ టీం, నార్వే ఎలైట్ రెస్క్యూ టీమ్‌లు (ఇంటర్నేషనల్ టీం) వచ్చిన రక్షణ చర్యల్లో కనిపించని పురోగతి
ఉత్తరాఖండ్ దేవ్ భూమి.. ఆధ్యాత్మిక ఆలయాలకు.. పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు ఉత్తరాఖండ్. తరచూ కొండచరియలు విరిగి పడుతున్న వాటిని తొలగించుకుంటూ తమ జీవనం గడుపుకుంటున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం గతంలో ఎప్పుడు రాని ఓ పెద్ద సమస్య ఇప్పుడు వారికి పెను సవాల్ గా మారింది. అదేంటో చూడండి..
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం చార్ ధామ్ లో ఒకటి అయిన యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యరా నుంచి దండల్ గావ్ వరకు నిర్మాణంలో ఉన్న సొరంగంలో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక ఈ ప్రమాదంలో సొరంగంలో 40 మంది కార్మికులు చిక్కుపోయారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఫలితం మాత్రం జరగడం లేదు. 140 గంటలుగా కార్మికులు ఆ టన్నెల్ లోనే ఉండిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా ఎలాంటి పురోగతి కనిపించకపోవడం బాధాకరమైన విషయం. ప్రస్తుతం కార్మికులు సురక్షితంగానే ఉన్నారని అధికారులు చెప్పారు. స్టీల్ పైప్స్ సాయంతో చిక్కుకున్న వారికి భోజనం, మంచి నీటిని పంపిస్తున్నట్టు వెల్లడించారు.
ఇది కూడా చదవండి : HARISH RAO: కాంగ్రెస్ పార్టీది 420 మేనిఫెస్టో: మంత్రి హరీశ్ రావు
6 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్..
6 రోజులుగా చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ పనులు మరోసారి నిలిచిపోయాయి.
పెద్ద పెద్ద పగుళ్ల శబ్దం వినిపించడంతో శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు రెస్క్యూ పనులు నిలిపివేసినట్టు జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఐడీసీఎల్) ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం సహాయక చర్యలు ముగిసేంత వరకు.. 245 మీటర్ల వరకు డ్రిల్ చేశారు. పనులు చేసే మార్గం బ్లాక్ అయ్యిందని, దీంతో డ్రిల్లింగ్ పనులు నిలిపివేసినట్లు వెల్లడించింది. మళ్లీ శనివారం ఉదయం పనులు మొదలు పెట్టిన సమయంలో.. డ్రిల్లింగ్ చేస్తుండగా భారీ శబ్దాలు వచ్చాయి. సొరంగం లోపల రెస్క్యూ పనుల్లో ఉన్నవారికి పగుళ్ల శబ్దం పెద్దగా వినిపించిందని, టన్నెల్ ఇంకా కూలిపోయే ప్రమాదం ఉందని భావించిన అధికారులు.. సహాయక చర్యలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇక తాజా పరిస్థితిపై నిపుణులు చర్చించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపింది.
సహాయక చర్యలకు ఆటంకం.. విరిగిపడుతున్న కొండచరియలు
ఇలా సహాయక చర్యలను నిలిపివేయడం వరుసగా ఇది రెండోరోజు. శుక్రవారం 2.45 గంటలకు సహాయక చర్యలను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. మళ్లీ శనివారం ఉదయం డ్రిల్లింగ్ చేస్తుండగా భారీ శబ్దాలు రావడంతో రెస్క్యూ పనులు నిలిపివేశారు అధికారులు.
2018లో థాయ్‌లాండ్‌లోని గుహలో చిక్కుకున్న పిల్లలను విజయవంతంగా.. సూరక్షితంగా రక్షించిన టీం, నార్వే ఎలైట్ రెస్క్యూ టీమ్‌లు కూడా ఈ ఆపరేషన్ చర్యల్లో పాల్గొన్నాయి. మరోవైపు ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, బీఆర్‌వో, ఐటీబీపీతోపాటు పలు ఏజెన్సీలకు చెందిన 165 మంది సిబ్బంది 24 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.
S.SURESH