వరల్డ్ వార్ స్టార్ట్, జ్యోతిష్యుడి సంచలన జ్యోతిష్యం

Is there a danger of falling into the trap of Hamas and losing Israel's economic, social, military, diplomatic and international support.
మళ్ళీ బాంబుల మోతలు, దూసుకువస్తున్న రాకెట్ లాంచర్లు, కాళ్ళు చేతులు తెగిపడే దృశ్యాలు, శవాల దిబ్బలు, సగం పడిపోయిన భవనాలు, ఆకలితో అలమటించే చిన్నారులు, సాయం కోసం ఎదురు చూసే ఆడవాళ్ళు… ఇప్పుడు ఈ సీన్లు చూడటానికి ప్రపంచం సిద్దం కావాల్సిందే అంటున్నాడు భారత జ్యోతిష్యుడు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య గొడవలో ఇరాన్ దూరడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. హమాస్ లీడర్ ను ఇరాన్ లో చంపడంతో ఒక్కసారిగా ఉద్రిక్తలు పెరిగాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అని పశ్చిమాసియా దేశాలు భయపడుతున్నాయి.
ఇప్పటికే రష్యా – ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు యూరప్ ఖండం వణికింది. ఇప్పుడు ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య యుద్ధం మొదలైతే ఏం జరుగుతుందో అనే భయం జనాల్లో ఉంది. ఇరాన్ కు రష్యా, ఇజ్రాయిల్ కు అమెరికా మద్దతు ఇచ్చాయి. దీనితో ఇప్పుడు వరల్డ్ వార్ షురూ అనే టాక్ వస్తుంది. దీనిపై ఇండియన్ నోస్ట్రడామస్ గా పాపులర్ అయిన హరియాణా రాష్ట్రానికి చెందిన కుశాల్ కుమార్ అనే జ్యోతిష్కుడు వరల్డ్ వార్ పై జ్యోతిష్యం చెప్పాడు. సోమవారం గాని మంగళవారం నుంచి గాని యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని ప్రకటించాడు.
ఈయన అంతకు ముందు కూడా అలాగే ప్రకటించాడు గాని యుద్ధం మాత్రం మొదలుకాలేదు. గతంలో 2024 జూన్ 18న మూడవ ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని చెప్పాడు. మళ్ళీ కాదు… జూలై 26 లేదా 28 తేదీల్లో యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని అన్నాడు. కానీ రెండు సార్లు అలా జరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు రోజుల్లో మొదలయ్యే సూచనలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఈయన జ్యోతిష్యం సక్సెస్ రేట్ పై క్లారిటీ లేదు గాని ఇంటర్నేషనల్ జ్యోతిష మ్యాగజైన్లలో ఈ జ్యోతిష్యాలను ప్రచురిస్తూ ఉంటారు. మరి ఈసారి ఏమవుతుందో చూద్దాం.