X Down time : X డౌన్ అయింది… ప్రపంచవ్యాప్తంగా ఆగిన ట్విట్టర్ (X)
X మరోసారి డౌన్ అయింది సాంకేతిక సమస్యలతో గురువారం ఉదయం 11 గంటల టైమ్ లో ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగింది. ఒక్క యూఎస్ లోనే 77 వేల మందికి ఈ సమస్య తలెత్తినట్టు డౌన్ టిటెక్టర్ అనే సంస్థ తెలిపింది.
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ X … ట్విట్టర్ సేవలు ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయాయి. మొబైల్, వెబ్ సైట్ రెండింటిలోనూ.. ఎక్స్ ఖాతాలను ఓపెన్ చేయగానే… రెగ్యులర్ మెస్సేజ్ లకు బదులు వెల్కమ్ టు యువర్ టైమ్ లైన్ అని కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో X సేవలకు నిలచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమెరికాలో 77 వేల మందికి ఈ సమస్య ఎదురైంది. కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ తో పాటు చాలా దేశాల్లో X తో పాటు… X ప్రోలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కెనడా, బ్రిటన్ లో 7 వేల మంది వినియోగదారులకు ఎక్స్ పనిచేయలేదని డౌన్ డిటెక్టర్ సంస్థ తెలిపింది. కొన్ని దేశాల్లో వెయిటింగ్ ఫర్ పోస్ట్స్ అని కనిపించినట్టు వినియోగదారులు తెలిపారు.
ట్విట్టర్ ఆగిపోయిన విషయాన్ని చాలామంది వినియోగదారులు ఫేస్ బుక్ లో తమ బాధను వెళ్ళగక్కారు. ట్విట్టర్ డౌన్ పేరుతో హాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో కంటిన్యూ అయింది. వేలమంది యూజర్స్ వీటిల్లో తమ మెస్సేజ్ లు పోస్ట్ చేశారు. ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత 2023జులైలో అమెరికా, యూకేల్లో ఇప్పటి వరకూ 13 వేల సార్లు X లో టెక్నికల్ ప్రాబ్లెమ్స్ తలెత్తాయని డౌన్ డిటెక్టర్ సంస్థ తెలిపింది. అంతకుముందు మార్చిలో కూడా కొన్ని గంటల పాటు X ఆగిపోయింది. మస్క్ కొన్న తర్వాత చాలామంది ఉద్యోగులను తొలగించడంతో తరుచుగా టెక్నికల్ ప్రాబ్లెమ్స్ వస్తున్నట్టు యూజర్స్ ఆరోపిస్తున్నారు.