బిగ్ బాష్ లీగ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆసీస్ ఆల్‌రౌండర్ డేనియల్ క్రిస్టియన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో క్రిస్టియన్ సిడ్నీ థండర్ తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం క్రిస్టియన్ థండర్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయాలతో సతమతమవుతున్న తన జట్టు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. థండర్ ఆటగాళ్లు డేనియల్ సామ్స్, కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ కొద్ది రోజుల కిందట మైదానంలో తీవ్రంగా గాయపడ్డారు. జేసన్ సంఘా, తన్వీర్ సంఘా, నిక్ మాడిసన్ గాయాల కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో థండర్‌కు వేరే అప్షన్ లేకపోవడంతో ఆ ఫ్రాంచైజీ కోరిక మేరకు క్రిస్టియన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. 41 ఏళ్ల క్రిస్టియన్ రెండేళ్ల కిందట రిటైర్మెంట్ ప్రకటించాడు.[embed]https://www.youtube.com/watch?v=mAirMjNmi50[/embed]