ఆస్తి కోసం, బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తను లేపేసిన భార్య
2023 జనవరి 12.. మడకశిరలోని కోడిగానిపల్లి సమీపంలో ఉన్న హంద్రీనివా బ్రిడ్జ్ కింద ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అటూఇటూగా ఓ 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అతను. బాడీ చూస్తేనే ఎవరో చంపి శవాన్ని ఇక్కడ పడేసినట్టు క్లియర్‌గా తెలుస్తోంది.
2023 జనవరి 12.. మడకశిరలోని కోడిగానిపల్లి సమీపంలో ఉన్న హంద్రీనివా బ్రిడ్జ్ కింద ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అటూఇటూగా ఓ 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అతను. బాడీ చూస్తేనే ఎవరో చంపి శవాన్ని ఇక్కడ పడేసినట్టు క్లియర్‌గా తెలుస్తోంది. కానీ ఎవరు. ఏంటి అని కనుక్కోడానికి ఎలాంటి క్లూ లేదు. క్లూ లేదు కదా అని పోలీసులు ఈ కేసును క్లోజ్ చేయలేదు. దాదాపు రెండు సంవత్సరాలు ఇదే కేసు కోసం పని చేశారు. ఎట్టకేలకు నిందితులను పట్టుకుని కటకటాల్లో నెట్టారు. మడకశిరలో మృతదేహం కనిపించిన వెంటనే పోలీసులు ఆధారాలు కాకుండా మిస్సింగ్ కేసులను వెతకడం ప్రారంభించారు. అన్ని ప్రాంతాల్లో కేసులు పరిశిలిస్తున్న టైంలో.. కర్నాటకలోని తుమకూరులో పెండింగ్‌లో ఉన్న ఓ మిస్సింగ్ కేసును గుర్తించారు పోలీసులు.
వెంటనే ఆ వ్యక్తి కుటుంబానికి మడకశిరలో దొరికిన డెడ్‌బాడీ ఫొటోలు పంపిచారు. వాళ్ల మనిషే అని కన్ఫాం అవ్వడంతో అక్కడి నుంచి దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన వ్యక్తి పేరు మోహన్ కుమార్. ఫ్యామిలీ గొడవల కారణంగా భార్య కవితకు దూరంగా ఉంటున్నాడు. అతని భార్య తన కొడుకు కౌశిక్, కూతురుతో కలిసి వేరే ప్రాంతంలో ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మోహన్ భార్యను అరెస్ట్ చేసి ఏం జరిగిందని విచారించారు. దీంతో మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. కవితకు తన ఆఫీస్‌లోనే పని చేస్తున్న అక్తర్ పాషా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. అక్తర్, కవిత కలిసి ఓ హోటల్ కూడా పెట్టారు. ఆ హోటల్‌కు అప్పుడప్పుడు మోహన్ వెళ్లి గొడవ చేసేవాడు. తనకు అన్యాయం చేశావంటూ కవితను తిట్టేవాడు. రీసెంట్‌గా గొడవకు వెళ్లిన సమయంలో.. తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా కవితకు గానీ పిల్లలకు గానీ ఇవ్వనంటూ చెప్పాడు.
దీంతో మోహన్‌ను చంపేయాలని కవిత నిర్ణయించుకుంది. కూతురికి ఒంట్లో బాగాలేదని నమ్మించి భర్తను ఇంటికి పిలించింది కవిత. ఇంట్లోనే తిని వెళ్లమని బిర్యానీ పెట్టింది. కానీ అప్పటికే వంట మనిషికి డబ్బిచ్చి ఆ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపింది. నిద్రలోకి జారుకున్న మోహన్ కుమార్‌ను కవిత, తన కొడుకు కౌశిక్, ప్రియుడు అక్తర్, వంట మనిషి మోహన్ కలిసి తలపై కర్రలతో కొట్టి చంపేశారు. తరువాత బాడీని కారులో తీసుకువచ్చి హంద్రీనివా కాలువలో పడేశారు. అక్కడి నుంచి బాడీ ప్రవాహానికి కొట్టుకువచ్చి బ్రిడ్జ్ కింద చిక్కుకుంది. దీంతో పోలీసులు నిందితులను హత్యకు ఉపయోగించిన కారు, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం తేలడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఆస్తికోసం భర్తను చంపి తాను జైలుకు వెళ్లడమే కాకుండా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేసింది కవిత.