ఐఫోన్ 16 కొంటున్నారా.. బుర్ర లేనట్లే.. యాపిల్ అంతం మొదలైందా..
సెప్టెంబర్ వచ్చిందంటే చాలు.. టెక్నాలజీ మార్కెట్‌లో వినిపించే మాట ఒకటే. ఐఫోన్ ఒక్క ఎడిషన్ ఎలా ఉందా అని ! చాలా అంచనాలు, చాలా రోజుల ఉత్కంఠ మధ్య.. ఐఫోన్ 16 రిలీజ్ చేసి యాపిల్ సంస్థ. బుకింగ్ స్టార్ట్ అయింది. మొబైల్ ఎలా ఉందా అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.
సెప్టెంబర్ వచ్చిందంటే చాలు.. టెక్నాలజీ మార్కెట్‌లో వినిపించే మాట ఒకటే. ఐఫోన్ ఒక్క ఎడిషన్ ఎలా ఉందా అని ! చాలా అంచనాలు, చాలా రోజుల ఉత్కంఠ మధ్య.. ఐఫోన్ 16 రిలీజ్ చేసి యాపిల్ సంస్థ. బుకింగ్ స్టార్ట్ అయింది. మొబైల్ ఎలా ఉందా అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. పక్కన ఎక్స్‌ట్రాగా ఒక బటన్ వదిలేస్తే.. ఐఫోన్ 16 కొత్తగా ఏం లేదు. పాత మోడల్ చూసిన ఫీలింగ్ వస్తుందే తప్ప.. ఐఫోన్ న్యూ మోడల్ అనిపించట్లేదు. ఫోన్ పక్కన ఓ కెమెరా బటన్ ఇచ్చారు. దీంతో జూమ్ ఇన్.. జూమ్ ఔట్ చేసుకోవచ్చు. ఇది తప్పిస్తే.. బయటకు కనిపించే పెద్ద మార్పులు ఏమీ లేవు ఐఫోన్‌లో.
అతిపెద్ద ఛేంజ్ ఏదైనా ఉంది అంటే.. అది ఐఫోన్ లోపల ఉంది. సరికొత్త ప్రాసెసింగ్ చిప్ A18తో ఐఫోన్ 16 వచ్చేసింది.. ఇది ఆపిల్ వర్షన్ ఆఫ్ ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. మాములుగా ఏఐ అంటే.. చాలా అడ్వాన్స్‌డ్. రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ నుంచి ఐఏ పవన్ ఫొటో ఎడిటింగ్ వరకు చాలా ఆప్షన్లు ఉంటాయ్. ఐతే ఐఫోన్ 16లో అవేమీ లేవు. ఇప్పటికే యూఎస్‌లో ఐఫోన్ 16 లాంచ్ అయింది. ఐతే ఏఐలో చాలావరకు ఫీచర్లు ఇంకా రెడీ కాలేదని తెలుస్తోంది. ఉడికీ ఉడకని గుడ్డులా.. సగమే డెవలప్ చేసిన ప్రొడక్ట్‌ను యాపిల్ లాంచ్ చేసింది. ఇంకా పూర్తి కాని, పూర్తిగా లేని ఫోన్‌ను.. ఎక్కువ ధరలకు సంస్థ అమ్మితే.. వాటిని కొంటే.. ఏమనాలో మీకే వదిలేస్తున్నాం.
యాపిల్, ఐఫోన్‌లో ఒకప్పటి మ్యాజిక్ కనిపించడం లేదు.. ఐడియాలు, డెవలప్‌మెంట్‌లు టోటల్‌గా తేడా కొట్టేశాయ్. నిజానికి యాపిల్ సంస్థ మొత్తం అమ్మకాల్లో ఐఫోన్‌లే సగం. అలాంటిది ఐఫోన్ అమ్మకాలు వాల్డ్‌వైడ్‌గా తగ్గుతున్నాయ్. 2024 జనవరి నుంచి మార్చి వరకు.. ఐఫోన్ అమ్మకాలు పది శాతం వరకు పడిపోయాయ్. సో ఇలాంటి టైమ్‌లో మళ్లీ ఐఫోన్‌ల మీదకు యూజర్లను అట్రాక్ట్ చేయించాలి. ఎలాగైనా వారు కొనేలా చేయాలి. దీనికోసం ఏఐలోకి దిగింది యాపిల్ సంస్థ. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ముందుకు వస్తున్నారు. మరి ఇదైనా సరిగ్గా పనిచేస్తుందా అంటే.. అదీ లేదు. సగం డెవలప్ చేసిన ఏఐతో వచ్చింది యాపిల్. కాపాడడం కాదు కదా.. ముంచేసే ప్రమాదం ముంచుకొస్తోంది.
ఐఫోన్ 16 మోడల్స్ 80వేల దగ్గర స్టార్ట్ అయి లక్షా 80వేల వరకు ఉన్నాయ్. ఇంత ఖర్చు పెట్టి కొత్త ఫోన్ కొంటే.. కొత్తగా ఏమైనా వస్తుందా అంటే.. నంబర్ మార్చి ఐఫోన్ 15 చేతిలో పెట్టినల్ అవుతుందో పరిస్థితి. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. యాపిల్ సంస్థ ప్రయాణం చూస్తుంటే.. క్లియర్‌గా అర్థం అయ్యేది ఒక్కటే. వాళ్ల దగ్గర ఐడియాలు లేవని! ఐడియాలు లేకుండానే నడిపించేస్తున్నారు. నిజానికి ఐఫోన్ అంటే.. అద్భుతమైన టచ్ ఎక్స్‌పీరియన్స్, సూపర్బ్ కెమెరా… యూనిక్ ప్రాసెసర్.. ఇదే ఐఫోన్‌ను బెటర్ చేశాయ్. ఇప్పుడు ఈ విషయాల్లో యాపిల్ వెనకబడి పోతోంది. నిజానికి కొత్త మోడల్ రిలీజ్ చేస్తున్నారంటే.. కెమెరాను బెటర్ చేయడం.. బ్యాటరీ లైఫ్‌ను పెంచడం మీదే ఏ సంస్థ అయినా వర్కౌట్ చేస్తుంది.
యాపిల్ మాత్రం ఆ పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇక ఏఐ గేమ్‌లోకి యాపిల్ చాలా ఆలస్యంగా వచ్చింది. ఇప్పటికే గూగుల్, శాంసంగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఓ ఆట ఆడుకుంటున్నాయ్. ఫోల్డింగ్, ఏఐ అంటూ.. శాంసంగ్ సంస్థ చాలా అడ్వాన్స్ వచ్చేసింది. ఆ సంస్థ ఇప్పుడు యాపిల్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. నిజానికి ఆ హక్కు ఉంది కూడా! శాంసంగ్‌లో ఏఐ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయ్. ఫ్లిప్ చేయొచ్చు, ఫోల్డ్ చేయొచ్చు.. ఇప్పుడు ట్రై ఫోల్డ్ ఫోన్ కూడా వచ్చేసింది.. అంటే ఒక్క ఫోన్‌ను మూడుసార్లు మడతపెట్టొచ్చు అన్నమాట. ఈ ట్రై ఫోల్డ్ ఫోన్ కోసం ఇప్పటికే 3మిలియన్ ఆర్డర్లు వచ్చేశాయ్. ఇలా మొబైల్ ఫీచర్ల విషయంలో శాంసంగ్‌లాంటి సంస్థలు ట్రెండ్ క్రియేట్ చేస్తుంటే.. యాపిల్ మాత్రం చాలా దూరం ఉండిపోయింది. పైగా మిగతా ఫోన్‌లతో కంపేర్ చేస్తే ఐఫోన్ ధరలు ఎక్కువ కూడా ! ఐఫోన్ 16 విక్రయాలు భారీగా ఉంటే.. యాపిల్ సంస్థ కాంపిటీషన్‌లో ఉంటుంది. లేదంటే కష్టమే. అందుకే ఏఐ రేసులోకి ఎంటర్ అయింది.
ఫోన్‌లు కాకుండా.. మిగతా ప్రొడక్ట్స్ విషయంలో యాపిల్ చాలా ప్రయత్నాలు చేసింది. ఏదీ వర్కౌట్ కాలేదు. లాస్ట్ ఇయర్ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ను లాంఛ్ చేశారు. అది కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఐఫోన్ విక్రయాలు కూడా పడిపోతున్నాయ్. వాల్డ్‌వైడ్ మొబైల్ మార్కెట్‌లో శాంసంగ్‌కు 20 శాతం షేర్ ఉంది.. యాపిల్ విషయం వచ్చేసరికి అది 17కు పడిపోయింది. యాపిల్ ఏం ఇస్తామని చెప్తుందో.. శాంసంగ్ ఇప్పటికే ఇచ్చేసింది. దీంతో ఐఫోన్ విక్రయాలు పడిపోతున్నాయ్. ఇలాంటి సమయంలో శాంసంగ్, గూగుల్‌కు పోటీగా ఏఐలోకి ఎంటర్ అయింది. అదీ పర్ఫెక్ట్‌గా వచ్చిందా అంటే.. అదీ లేదు. హాప్ బాయిల్డ్‌లా హాప్ డెవలప్డ్ ఏఐ సాఫ్ట్‌వేర్‌తో వచ్చేసింది. ఇదీ యాపిల్ సొంతమా అంటే.. అదీ కాదు. యాపిల్ సంస్థకు ప్రత్యేకమైన ఏఐ మోడల్ లేదు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం థర్డ్ పార్టీ యాప్‌ల మీద ఆధారపడుతున్న పరిస్థితి. ప్రత్ేయకమైన ఏఐ మోడల్ ఉంటే.. యూజర్లను అట్రాక్ట్ చేయొచ్చు.. అలాంటిదేమీ కనిపించడం లేదు. అలాంటప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి ఐఫోన్ 16 కొనడం అవసరమా. శాంసంగ్ గెలాక్సీ ఫోన్‌లు చూస్తే.. రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్, ఏఐ పవర్డ్ ఫొటో ఎడిటింగ్, రైటింగ్ అండ్ టెక్ట్స్ సమ్మరైజేషన్ ఉంటుంది. ఐతే యాపిల్‌లో అలాంటివేమీ లేవు. అలాంటప్పుడు డబ్బులు తగలేయడం అవసరమా. ఒకప్పుడు అన్ని మొబైల్స్‌తో కంపేర్ చేస్తే ఐఫోన్ ఫీచర్స్ యూనిక్ ఉండేవి.. బెస్ట్ ఉండేవి. అందుకే ఐఫోన్ వాడేవాళ్లు. ఇప్పుడు అందరికంటే వెనకబడిపోయింది యాపిల్. ఇలాంటి టైమ్‌లో ఏఐ రేసులోకి ఎంటర్ అయింది యాపిల్. ఇది ఒకరకంగా ఆ సంస్థకు డూ ఆర్ డై లాంటిది. యాపిల్ సంస్థను నిలబెట్టింది ఐఫోన్లు. ఇప్పుడు ఏఐ ఫీచర్లతో ముందుకు వచ్చింది. ఇప్పుడు కొత్త ట్రెండ్ క్రియేట్ చేయకపోతే.. యాపిల్‌కు జరగబోయేది ఊహించుకోవడం కూడా కష్టమే. మరో బ్లాక్‌బెర్రీ, మరో నోకియాలా.. యాపిల్ కూడా అంతరించిపోయే ప్రమాదం లేకపోలేదు. మొబైల్ మార్కెట్‌ను దశాబ్దంపాటు డామినేట్ చేసిన సంస్థ నుంచి… ఏ చిన్న పొరపాటు జరిగినా.. ఏ చిన్నది తక్కువ అయినా.. అది పెద్ద లాస్‌గా మారడం ఖాయం. ఇప్పుడు యాపిల్, ఐఫోన్ ముందున్న సవాల్ అదే.