ఆస్ట్రేలియా టూర్ జరుగుతుండగానే కాదు ముగిసిన తర్వాత కూడా రోహిత్ , విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై పెద్ద చర్చే జరిగింది. రోహిత్ తాను రిటైర్ కావడం లేదంటూ క్లారిటీ ఇవ్వగా కోహ్లీ మాత్రం స్పందించలేదు. కానీ కోహ్లీ ఇప్పట్లో రిటైరయ్యే అవకాశాలు లేవన్నది కొందరు మాజీ ఆటగాళ్ళ అభిప్రాయం. రోహిత్ తో పోలిస్తే ఫిట్ గా ఉండడమే దీనికి కారణం. అదే సమయంలో గతంలో పలుసార్లు ఇలాగే ఫామ్ కోల్పోయి మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చిన రికార్డు కూడా కోహ్లీకి ఉంది. ఇదిలా ఉంటే కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వకున్నా బీసీసీఐ వేటు వేస్తుందన్న వార్తలు కూడా ఆ మధ్య వినిపించాయి. కానీ కోహ్లీని కాపాడిందే శుభమన్ గిల్ పేలవ ఫామేనని భావిస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యంపై జరిగిన రివ్యూ మీటింగ్ తర్వాత బోర్డు వర్గాలు ఇదే మాట చెబుతున్నాయి. రోహిత్ ను రిప్లేస్ చేసే ఆటగాళ్ళు ఉన్నప్పటకీ... ప్రస్తుతం కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్ళ కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. శుభ్ మన్ గిల్ అతని స్థానాన్ని రీప్లేస్ చేస్తాడని చాలా మంది అంచనా వేశారు. కానీ గత కొంతకాలంగా గిల్ ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. ఇటీవల ఆసీస్ టూర్ లోనూ అతను ఫ్లాప్ అయ్యాడు. దీంతో గిల్ అత్యుత్తమ ఫామ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కోహ్లీ స్థానానికి ముప్పు ఉంటుందన్నది కొందరి అభిప్రాయం. ప్రస్తుతానికి కోహ్లీ ఫామ్ పై సెలక్టర్లు ఆందోళన చెందుతున్నారని తెలిసింది. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో గిల్ చేసే ప్రదర్శనపై కోహ్లీ ఫ్యూచర్ ఆధారపడి ఉందని బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కు ఇంకా ఐదు నెలల సమయం మిగిలి ఉంది. అయితే సచిన్ వారసత్వాన్ని కోహ్లీ ఎలా కొనసాగించాడో, అలానే కోహ్లీ స్థానాన్ని గిల్ భర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడనీ, దీని గురించే బీసీసీఐ రివ్యూ మీటింగ్ లో చర్చ జరిగిందని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో గిల్ నిరాశపరిచాడు. ఐదు ఇన్నింగ్స్ లో కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క ఫిఫ్టీ కూడా లేదు. 2020-2021 గబ్బా టెస్ట్ లో అదిరే ప్రదర్శన చేసిన గిల్, ఆ తర్వాత ఆసియా బయట జరిగిన మ్యాచుల్లో ఫ్లాప్ షో కనబరిచాడు. తన గత 14 ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలు లేకుండా 233 పరుగులు మాత్రమే చేశాడు.అటు కోహ్లీ కూడా ఇటీవల ఆసీస్ టూర్ లో ఒక్క సెంచరీ మాత్రమే సాధించాడు. కంగారూ గడ్డపై మంచి రికార్డు ఉన్నప్పటకీ విరాట్ నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో జూలైలో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ ఇటు కోహ్లీకి, అటు గిల్ కు కీలకం కానుంది.[embed]https://www.youtube.com/watch?v=v7J1En76WuM[/embed]