పవన్ టూర్, పరుగులు తీస్తున్న అధికారులు…!

ఇటీవల అచ్యుతాపురంలో చోటు చేసుకున్న ప్రమాదం నేపధ్యంలో పరిశ్రమల విషయంలో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల భద్రత కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నీ ఫాలో అవ్వాలని, పరిశ్రమల్లో అంతర్గిక ఆడిట్ పక్కగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 23, 2024 | 11:00 AMLast Updated on: Aug 23, 2024 | 11:00 AM

పవన్ టూర్ పరుగులు తీస్తు

ఇటీవల అచ్యుతాపురంలో చోటు చేసుకున్న ప్రమాదం నేపధ్యంలో పరిశ్రమల విషయంలో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల భద్రత కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నీ ఫాలో అవ్వాలని, పరిశ్రమల్లో అంతర్గిక ఆడిట్ పక్కగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సేఫ్టీ ఆడిట్ జరిగిన ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయనే దానిపై విచారణ నిర్వహించాలని సర్కార్ అడుగులు వేస్తోంది.

1997 నుంచి నేటి వరకు 110 మంది మరణించినట్లు అధికారులు అంచనా వేసారు. రాష్ట్రంలో రెడ్ క్యాటగిరి పరిశ్రమలు 300 ఉండగా దాదాపుగా 228 పరిశ్రమలు విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. అలాగే పరిశ్రమంలో భద్రత పరమైన చర్యలు పర్యవేక్షించి రెండు రోజులలో తమకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. జిల్లా స్థాయిలో ఉన్న సేఫ్టీ కమిటీ సమావేశాలు తక్షణమే సమావేశం కావాలని ఆదేశించింది.

ప్రతి పరిశ్రమలో ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇక పవన్ కళ్యాణ్ పలు కంపెనీల్లో స్వయంగా అధికారులతో కలిసి ఆడిటింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు కంపెనీల యజమానులతో స్వయంగా మాట్లాడి జాగ్రత్తలు తీసుకోకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించినట్టు తెలుస్తోంది.