బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్ యువక్రికెటర్లకే ఛాన్స్

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ మూడు టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పలువురు స్టార్ క్రికెటర్లకు బీసీసీఐ విశ్రాంతినివ్వడం ఖాయమైంది. న్యూజిలాండ్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్, తర్వాత ఆసీస్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉండడంతో సీనియర్లకు రెస్ట్ ఇవ్వనున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 28, 2024 | 05:35 PMLast Updated on: Sep 28, 2024 | 5:35 PM

బంగ్లాతో టీ ట్వంటీ సిరీస

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ మూడు టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పలువురు స్టార్ క్రికెటర్లకు బీసీసీఐ విశ్రాంతినివ్వడం ఖాయమైంది. న్యూజిలాండ్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్, తర్వాత ఆసీస్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉండడంతో సీనియర్లకు రెస్ట్ ఇవ్వనున్నారు. దీంతో పూర్తిగా యువ జట్టుతోనే భారత్ బరిలోకి దిగుతోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హర్థిక్ పాండ్యా తప్పిస్తే మిగిలిన వారంతా యువ ఆటగాళ్ళే ఉండనున్నారు. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు చోటు దక్కనుంది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున అద్భుతంగా రాణిస్తున్న అభిషేక్ శర్మ ఇటీవల జింబాబ్వేతో సిరీస్ ద్వారా అరంగేట్రం చేశాడు. గిల్, జైశ్వాల్ లకు విశ్రాంతినివ్వనున్న నేపథ్యంలో అతనికి చోటు ఖాయమైనట్టే. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కు కూడా రెస్ట్ ఇస్తే సంజూ శాంసన్ కు చోటు దక్కనుంది. బ్యాకప్ వికెట్ కీపర్ గా జితేశ్ శర్మ తన ప్లేస్ నిలుపుకోనున్నాడు.

ఆల్ రౌండర్ కోటాలో హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే ఎంపికవనుండగా… రియాన్ పరాగ్, రింకూ సింగ్ కూడా జట్టులోకి రానున్నారు. అటు బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లుగా కుల్దీప్ యాద్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ లకు చోటు ఖాయం. ఇక పేస్ బౌలింగ్ ను అర్షదీప్ సింగ్ లీడ్ చేయనున్నాడు. అతనితో పాటు ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ లను ఎంపిక చేసే అవకాశముంది. సొంతగడ్డపై యువ క్రికెటర్లకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. బంగ్లాదేశ్ తో మూడు టీ ట్వంటీల సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ గ్వాలియర్ లో జరగనుండగా.. రెండో టీ ట్వంటీకి న్యూఢిల్లీ, చివరి టీ ట్వంటీకి హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుననాయి.