లాస్ట్ ప్లేస్ లో పాకిస్తాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్
సొంతగడ్డపై వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. తాజాగా ఇంగ్లాండ్ పై తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఓటమి చవిచూడడంతో చివరి స్థానానికి దిగజారింది.

సొంతగడ్డపై వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. తాజాగా ఇంగ్లాండ్ పై తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఓటమి చవిచూడడంతో చివరి స్థానానికి దిగజారింది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ ముందువరకు 19.05 శాతంతో ఎనిమిదవ ప్లేస్ లో ఉన్న పాక్.. తాజాగా 16.67 శాతంతో తొమ్మిదో ప్లేస్ కు పడిపోయింది. డబ్ల్యూటీసీ 2023 -25 సీజన్ లో పాకిస్థాన్ ఎనిమిది టెస్టు మ్యాచ్ లు ఆడింది. కేవలం రెండు మ్యాచ్ లలోనే గెలిచి…మిగిలిన ఆరు ఓడిపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్ లో పది మ్యాచ్ లు ఆడిన భారత్ జట్టు ఏడు విజయాలతో 74.24శాతంతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.