భారత క్రికెట్ లో రిటైర్మెంట్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ అంతర్జాతీయ క్రికెట్ ను రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల ఆరోన్ సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. తన కుటుంబం, స్నేహితులు, సహచరులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అభిమానులతో పాటు బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పాడు. వరుణ్ ఆరోన్ ఐపీఎల్ లో రాణించి 2011లో ఇంగ్లాండ్ పై తొలిసారి భారత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. అదే ఏడాది నవంబర్ లో వెస్టిండీస్ పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. టీమిండియా తరపున 9 టెస్టులు.. 9 వన్డేలు మాత్రమే ఆడాడు. టెస్టుల్లో 18 వికెట్లు తీసిన ఆరోన్ వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ తరవాత పేలవ ఫామ్ కారణంగా భారత జట్టుకు దూరమయ్యాడు.