TAPPING 10 : ట్యాపింగ్ కేసులో 10మంది BRS నేతలు.. వచ్చే వారంలో నోటీసులు ?
KCR హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) BRS నేతల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటి దాకా మొత్తం 10 మంది గులాబీ నేతలు ఈ ట్యాపింగ్ వెనుక ఉన్నట్టు పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police) గుర్తించారు.
KCR హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) BRS నేతల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటి దాకా మొత్తం 10 మంది గులాబీ నేతలు ఈ ట్యాపింగ్ వెనుక ఉన్నట్టు పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police) గుర్తించారు. వాళ్ళను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం ప్రశ్నావళిని కూడా రెడీ చేస్తునారు. టాస్క్ ఫోర్స్ మాజీ బాస్ రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీలో అనేక సంచలన విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తోంది.
రాధాకిషన్ రావు ఏడు రోజుల పోలీస్ కస్టడీలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టారు పోలీసులు. ఆయన కస్టడీ బుధవారంతో ముగిసింది. రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారంతో ఇక అరెస్టుల పర్వం కొనసాగనుంది. ఫోన్ ట్యాపింగ్ చేయించిన 10మంది BRS నేతలను గుర్తించారు. వాళ్ళందరిపైనా వచ్చేవారంలో ఫోకస్ పెట్టనున్నారు పోలీసులు. ఆ గులాబీ నేతలు ఎవరెవరు ఏమని ఆదేశాలు ఇచ్చారో… రాధాకిషన్ రావు క్లియర్ గా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే వాళ్ళకి సంబంధించి పకడ్బందీగా ఎవిడెన్స్ లను కూడా కలెక్ట్ చేస్తోంది సిట్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా అరెస్టయిన పోలీస్ అధికారుల విచారణకు సంబంధించి పేపర్ వర్క్ ను ఫినిష్ చేశాక… అప్పుడు BRS నేతల మీద దృష్టి పెట్టనున్నారు. వారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తారు. BRS నేతలను ప్రశ్నించేందుకు న్యాయనిపుణుల సహకారంతో 200కు పైగా ప్రశ్నలను పోలీసులు రెడీ చేశారు. దీంతో వచ్చేవారంలో ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశముంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలున్న SIB మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నఆయన పోలీసుల అరెస్ట్ ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటిదాకా అరెస్ట్ అయిన పోలీస్ అధికారులంతా ప్రభాకర్ రావు పేరే చెప్పడంతో ఆయన అడ్డంగా ఇరుక్కుపోయారు. అందుకే న్యాయపరంగా ఎలాంటి అవకాశాలున్నా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. హైదరాబాద్ లో తనకు తెలిసిన న్యాయవాదులతో ప్రభాకర్ రావు మాట్లాడుతున్నట్టు సమాచారం. పంజాగుట్ట పోలీసులు మాత్రం… ప్రభాకర్ రావును వీలైనంత తొందరగా అరెస్ట్ చేస్తే… ఈ కేసు మొత్తం కొలిక్కి వస్తుందని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కి ఆదేశించిన అప్పటి ప్రభుత్వ పెద్దలు, BRS కీలక నేతలు ఎవరన్నది బయటపడే అవకాశముంది.