Congress : కాంగ్రెస్‌లోకి 15 మంది కార్పోరేటర్లు.. వాళ్ల వెనక ఉంది మల్లారెడ్డేనా ?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది బీఆర్ఎస్‌ నేతలు పార్టీ మారుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన నేతలు కూడా పార్టీ విడిచి వెళ్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 11, 2024 | 12:35 PMLast Updated on: Jul 11, 2024 | 12:35 PM

15 Corporators In Congress Mallaredde Is Behind Them

 

 

 

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది బీఆర్ఎస్‌ నేతలు పార్టీ మారుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన నేతలు కూడా పార్టీ విడిచి వెళ్తున్నారు. ఎమ్మెల్యేలే పార్టీ మారగా మేంమెంత అనుకున్నారో ఏమో.. పీర్జాదిగూడ కార్పోరేషన్‌లో 15 మంది బీఆర్ఎస్‌ కార్పోరేటర్లు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. డిప్యుటీ మేయర్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరగబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ 15 మంది కార్పోరేటర్లు గోవా క్యాంప్‌లో ఉన్నారు. శివకుమార్‌ ఈ క్యాంప్‌ ఏర్పాటు చేసి కార్పోరేటర్లను తరలించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జవహార్‌నగర్‌, బోడుప్పల్‌లో కూడా ఇదే సీన్‌ కనిపించింది. కార్పోరేటర్లు పార్టీ మారడంతో ఆ కార్పోరేషన్లు కాంగ్రెస్‌కు హస్తగతమయ్యాయి. ఇప్పుడు అదే బాటలో పీర్జాదిగూడ కార్పోరేషన్‌ కూడా కాంగెస్‌ అండర్‌లోకి రానుంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మల్లారెడ్డిని కూడా చుట్టేస్తోంది. మల్లారెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లబోతున్నారంటూ కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. రీసెంట్‌గా ఈ ప్రచారం ఊపందుకుంది కూడా. ఇలాంటి తరుణంలో ఒకేసారి 15 మంది కార్పోరేటర్లు పార్టీ మారడంతో మల్లారెడ్డే వీళ్లను వెనకుండి నడిపిస్తున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

దీని వెనక ఎవరున్నారు? కార్పోరేటర్లు కావాలనే కాంగ్రెస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారా.. లేక మల్లారెడ్డే వాళ్లను ముందు పంపిస్తున్నారా అన్న విషయం పక్కన పెడితే.. తెలంగాణలో అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్‌ పరిస్థితి దారుణంగా మారిపోయింది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఇలా కార్పోరేటర్లు కూడా పార్టీ మారుతుండటంతో నెమ్మదిగా గ్రౌండ్‌లో పట్టు కోల్పోతోంది బీఆర్ఎస్‌ పార్టీ..