గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని అడవిలో 15 కిలోమీటర్లు

సాధారణంగా గూగుల్ మ్యాప్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విదేశాల తరహాలో మన దేశంలో మ్యాప్స్ అంత పక్కాగా ఉండవు అనే విమర్శలు ఉన్నాయి. తాజాగా కాకినాడలో జరిగిన ఒక ఘటనతో ఇది రుజువు అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2024 | 12:47 PMLast Updated on: Aug 31, 2024 | 12:47 PM

15 Kms In Forest Trusting Google Maps

సాధారణంగా గూగుల్ మ్యాప్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విదేశాల తరహాలో మన దేశంలో మ్యాప్స్ అంత పక్కాగా ఉండవు అనే విమర్శలు ఉన్నాయి. తాజాగా కాకినాడలో జరిగిన ఒక ఘటనతో ఇది రుజువు అయింది. గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని అడవిలో చిక్కుకున్నాడు ఒక లారీ డ్రైవర్. కాకినాడ నుంచి ఎరువుల బస్తాలతో ములుగు జిల్లా రాజ్ పేట కు లారీ వెళ్తుంది.

మణుగూరు రూట్ నుంచి రాజ్ పేట కు చేరుకోవాల్సి ఉండగా.. కరకగూడెం మండలం రేగల్ల నుంచి గూగుల్ మ్యాప్ లో తక్కువ కిలో మీటర్ల దూరం చూపించడంతో.. రేగల్ల.. మర్కోడు మధ్య 14 కిలో మీటర్లు అడవి మార్గం లో వచ్చి బురదలో లారీ ఇరుక్కుపోయింది. స్థానికులు సహాయంతో ఎక్స్ కవేటర్ ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతూ 5 కిలో మీటర్లు వెనక్కి రివర్స్ లో లారీని బయటకు తీసుకొచ్చాడు లారీ డ్రైవర్.