ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో పరిస్థితులు తలకిందులవుతున్నాయి. సాఫ్ట్ వేర్ (Software) ఉద్యోగం అంటేనే గ్యారెంటీ లేని జాబ్స్ అయ్యాయి. ఎప్పుడు ఐటీ (IT) కంపెనీ పైకి లేస్తుందో.. ఎప్పుడు కంపెనీ కుదెలు అవుతుందో అని ఐటీ ఉద్యోగులు బిక్కు బిక్కు మంటున్నారు. ఏ క్షణంలో ఉద్యోగం ఊడుతుందో తెలియక వణికిపోతున్నారు. తాజాగా మరో సంస్థ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది. ఖర్చు తగ్గింపు ప్రణాళిక లో భాగంగా ఏకంగా 18 వేల కొలువులు తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ చిప్ తయారీ ఇంటెల్ సంస్థ (Intel Corporation) మొత్తం ఉద్యోగుల్లో ఇది 15శాతం కావడం గమనార్హం.. ఈ చర్యతో సంస్థకు ఏటా 20 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని అంచనా.. ఈమధ్య కాలంలో నష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తప్పలేదని సంస్థ వర్గాలు వివరించాయి. ఇంటెల్ (Intel) సంస్థలో 2022లో సుమారుగా 1,31,900 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీళ్లందరిని ఒకే సారి ఉద్యోగాల నుంచి తొలగించింది. అప్పట్లో 2022 నుంచి డిసెంబర్ 2023 మధ్య ఎద్ద ఎత్తున్న ఉద్యోగాలను తొలగించిన సంస్థగా అందిరిని ఆకార్షించింది. దీంతో ఇప్పుడు మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యోగులను తొలగించేందుకు ముఖ్య కారణం ఇంటెల్ సంస్థ ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఇంటెల్ సంస్థలో 1,10,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలోనే మరోసారి తమ సంస్థలోని ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు ఇంటెల్ సిద్ధమైంది. 2024 ప్రపంచ వ్యాప్తంగా తొలగించిన ఉద్యోగుల సంఖ్య... ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా 380 ఐటీ కంపెనీలు.. ఒక లక్షా 9 వేల 297 మందిని తొలగించాయి. వీళ్లే కాకుండా కాంట్రాక్ట్, ఏజెన్సీల కింద పని చేసే మరో లక్ష మంది ఐటీ ఉద్యోగులు కూడా తమ జాబులు కోల్పోయారు. ఇప్పటికే చాలా దిగ్గడ కంపెనీలు లే ఆఫ్ ను ప్రకటిస్తుండగా.. తాజాగా చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కూడా అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ వారంలోనే వేలాది మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్బర్గ్ నివేదించింది.