4 రోజుల్లోనే 2 డబుల్ సెంచరీలు, ఇదేం విధ్వంసంరా అయ్యా !
ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా మంది యువ బ్యాటర్లు ఫార్మాట్ తో సంబంధం లేకుండా దంచేస్తున్నారు. ఆడుతోంది రెడ్ బాల్ తోనే, వన్డే ఫార్మాట్ లోనా అన్నది చూడకుండా పరుగుల వరద పారిస్తున్నారు. అందుకే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి.
ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా మంది యువ బ్యాటర్లు ఫార్మాట్ తో సంబంధం లేకుండా దంచేస్తున్నారు. ఆడుతోంది రెడ్ బాల్ తోనే, వన్డే ఫార్మాట్ లోనా అన్నది చూడకుండా పరుగుల వరద పారిస్తున్నారు. అందుకే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ క్రికెటర్ సమీర్ రిజ్వీ అరుదైన రికార్డు సృష్టించాడు. అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో రిజ్వీ తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. 4 రోజుల్లోనే రెండోసారి డబుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. మొన్న త్రిపురపై డబుల్ సెంచరీ చేసిన రిజ్వీ ఈసారి విదర్భ జట్టుపై భారీ ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే ఫార్మాట్ లో డబుల్ సెంచరీ చేస్తేనే గొప్ప… అలాంటిది ఒకసారి కాదు వరుసగా రెండుసార్లు డబుల్ సెంచరీతో దుమ్మురేపితే అంతకంటే అద్భుతం ఏముంటుంది.రిజ్వీ విధ్వంసంతో యూపీ 407 పరుగుల టార్గెట్ ను ఊదిపారేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సమీర్ రిజ్వీ 105 బంతుల్లో 202 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 18 సిక్సర్లు బాదాడు. సమీర్ రిజ్వీ 192.38 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు. సమీర్ ఇన్నింగ్స్ కారణంగా తన జట్టు కేవలం 41.2 ఓవర్లలోనే 407 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది
అంతకుముందు సమీర్ రిజ్వీ కూడా డిసెంబర్ 21న త్రిపురపై డబుల్ సెంచరీ సాధించాడు. 21 ఏళ్ల సమీర్ రిజ్వీ త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 97 బంతుల్లో 201 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ఇదే. హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో 114 బంతుల్లో 153 పరుగులు చేసిన సమీర్ రిజ్వీ, పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లో 137 పరుగులు చేశాడు.. మూడు ఇన్నింగ్స్‌ల్లో 42 సిక్సర్లు బాదిన సమీర్ రిజ్వీ, దేశవాళీ అండర్23 స్టేట్ క్రికెట్ టోర్నీల్లో రికార్డు పర్ఫామెన్స్ చూపిస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో మొదటి బంతికి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు సమీర్ రిజ్వీ. అయితే ఆ తర్వాత పెద్దగా ఆశించిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో పెద్దగా రాణించలేకపోయిన సమీర్ రిజ్వీ, 12.75 సగటుతో 51 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సమీర్ రిజ్వీ టాప్ స్కోర్ 21 మాత్రమే.
నిజానికి ఐపీఎల్ వేలంలో భారీ ధర పెట్టి యంగ్ ప్లేయర్లను కొనుగోలు చేయడం, వారిని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి వేలానికి విడుదల చేయడం చెన్నై సూపర్ కింగ్స్‌కి అలవాటు. 2024 వేలంలో రూ.8.4 కోట్లు పెట్టి సమీర్ రిజ్వీని కొనుగోలు చేసిన సీఎస్‌కే, అతన్ని సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. ఇటీవల మెగావేలానికి ముందు ఈ యంగ్ ప్లేయర్ ను వదిలేసింది. అయితే మెగా ఆక్షన్ లో సమీర్ రిజ్వీని 95 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. దీంతో రిజ్వీని వదిలేసి చెన్నై తప్పుచేసిందా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ తక్కువ ధరకే మంచి హిట్టర్ ను పట్టేసిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.