పాట ఒకరు… బ్యాగ్రౌండ్ సౌండొకరు… 300 కోట్ల వెనక 300 కోట్ల నిజం…
రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని షాక్ కి గురిచేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ పనులు ఎప్పుడు మొదలౌతాయో అని అనుకుంటుంటే, ఈలోపే ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ చేసినట్టు తేల్చాడు. ఆల్రెడీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులు మొదలయ్యాయి.
రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని షాక్ కి గురిచేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ పనులు ఎప్పుడు మొదలౌతాయో అని అనుకుంటుంటే, ఈలోపే ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ చేసినట్టు తేల్చాడు. ఆల్రెడీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులు మొదలయ్యాయి. తన ఫస్ట్ మూవీ నుంచి యానిమల్ వరకు ప్రతీ సినిమాకు బీజీఎంలు స్కోర్ చేసే హర్షవర్దన్ తో సిట్టింగ్ మొదలైంది. అంటే కథ సిద్దమైనట్టేనని తేలిపోయింది. ఇదే కాదు తన ప్రతీ మూవీకి కనీసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు లేందే సందీప్ సినిమాకు సంగీత దాహం తీరదు… అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూడీంటికి ఇదే పద్దతి ఫాలో అయ్యాడు ఈ డైరెక్టర్. ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాడు. కాకపోతే 1000 కోట్ల స్పిరిట్ మూవీలో అసలు ఖర్చంతా 300 కోట్లేనట… మిగలిన 700 కోట్లు కేవలం పారితోషకాలకే సమర్పిస్తున్నారు. ఇదే కిర్రాక్ న్యూస్… ఆలెక్కన 300 కోట్ల మూవీకి 700 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేదెవరు? ప్రభాస్ 300 కోట్ల కటౌట్ అని తెలుసు కాని, 700 కోట్ల లెక్కేంటి..? మొత్తంగా స్పిరిట్ కొత్త అప్ డేట్ వల్ల ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ఓ ప్రశ్నకు సమాధానం దొరికింది… కాని 700 కోట్ల లెక్కతో కొత్త డౌట్ పెరిగింది… సో ఈ రెండీంటి సంగతేంటోచూసేయండి.
సలార్, కల్కీ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ది రాజా సాబ్ తో ఏప్రిల్ 10 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ ని షేక్ చేయబోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. అందులో ఏకంగా మూడు పాత్రల్లో కనిపించనున్న తను, ఆతర్వాత ఫౌజీ తో 2026 సంక్రాంతిని టార్గెట్ చేసుకుంటున్నాడు. ఆతర్వాతే
స్పిరిట్ వస్తుంది. కానివచ్చేనెల 25నే స్పిరిట్ లాంచ్ అవటం ఆల్ మోస్ట్ కన్పామ్ అయ్యింది.
ఆ విషయాన్ని నిజం చేస్తూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అప్ డేట్ తో రెబల్ ఫ్యాన్స్ కి పూనకాలు తెచ్చాడు. స్పిరిట్ మూవీకి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టు వీడియో పోస్ట్ చేయటంతో సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పుడు వైరలైంది
ఈ వీడియో వల్ల బయట పడ్డ విషయమేంటంటే, కథ, కథనం,ఇలా మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాందే ఎవరూ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూచేయరు… కాబట్టి స్పిరిట్ కథ, కథనం పూర్తైందని కన్ఫామ్ అయ్యింది. ఇక కన్ఫామ్ కావాల్సింది, సినిమా లాంచ్ అయ్యేదెన్నడు…? రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి.. అలానే రిలీజ్ డేట్ తోపాటు ఇందులో పోలీస్ గా హీరోలుక్ ఎలా ఉండబోతోంది.. ఈ మూడు ప్రశ్నలకు వచ్చేనెల్లో సమాధానం దొరికేలా ఉంది..
కాకపోతే అన్ అఫీషియల్ గా, లాంచింగ్ డేట్, రెగ్యులర్ షూటింగ్ ముహుర్తం రెండూ ఫైనలయ్యాయి. ఇక తేలాల్సింది ప్రభాస్ లుక్ ఒక్కటే… క్రిస్మస్ స్పెషల్ గా స్పిరిట్ ని వచ్చేనెల 25న లాంచ్ చేయబోతోంది ఫిల్మ్ టీం. కాకపోతే ది రాజా సాబ్, ఫౌజీ రెండు సినిమాల షూటింగ్ పూర్తయ్యాకే స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ షురూ చేయాలనేది సందీప్ కండీషన్. తన స్పిరిట్ మూవీ చేస్తున్నప్పుడు ప్రభాస్ మరే సినిమా చేయకూడదు..తన లుక్ రివీల్ కాకూడదు.. ఇలారెండు కండీషన్స్ పెట్టడం, అందుకు ప్రభాస్ ఒప్పుకోవటంతో ఈరెండు విషయాలు తేలాయి.
ఐతే ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో తేలలేదు కాని, క్రిస్మస్ రోజు ఈ సినిమా లాంచవుతుంటే, మాత్రం స్పిరిట్ థీమ్ మ్యూజిక్ ని రిలీజ్ చేస్తారట. అందుకే ఈ కసరత్తు… ఇక స్పిరిట్ కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తోంది హర్షవర్ధన్.. తనే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సాంగ్స్ మాత్రం ఒక్కో మూవీకి ఒక్కోమ్యూజీషియన్ కంపోజ్ చేశారు.
సో స్పిరిట్ కి కూడా ఇద్దరుమ్యూజిక్ డైరెక్టర్ల ఫార్ములానే ఫాలో అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికొస్తే, 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే మొదటి ఇండియన్ సినిమా అంటున్నారు. హిందీ రామాయణం 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నా, అది మూడు భాగాలుగా ప్లాన్ చేసిన మూవీ. అంటే ఒక్కో పార్ట్ కి 500 కోట్లు.. అలాచూస్తే అంతకు డబుల్ బడ్జెట్ స్పిరిట్ మూవీకి ప్లాన్ చేశారు
ఐతే స్పిరిట్ తాలూకు 1000 కోట్ల బడ్జెట్ లో 300 కోట్లు రెబల్ స్టార్ రెమ్యునరేషన్ అయితే, 300 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగ.. టీ సీరీస్ తో కలిసి భద్రకాలి పిక్ఛర్స్ పేరుతో తను కూడా ఈసినిమాను నిర్మిస్తున్నాడు. కాకపోతే, తన వాటాని ఇలా ముందే రెమ్యునరేషన్ రూపంలో తీసుకుంటున్నాడట. అలా చూస్తే ప్రబాస్, సందీప్ ఇద్దరి రెమ్యునరేషన్లే 600 కోట్లు, మిగిలిన 400 కోట్లలో 300 కోట్లు షూటింగ్ కి, గ్రాఫిక్స్ తో పాటు మిగతా ఖర్చులకోసం కేటాయించారట. ఇక మిగిలిన 100 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్ కోసం ఖర్చుచేస్తారని తెలుస్తోంది.