MLA Sitakka : సీతక్కను ఓడించేందుకు 200 కోట్లు !?
కాంగ్రెస్ పార్టీ (Congress party) లో ఎలాంటి వివాదాలు లేని ఎమ్మెల్యే ఎవరు అంటే ఫస్ట్ వినిపించే పేరు ములుగు (Mulugu) ఎమ్మెల్యే సీతక్క ( MLA Sitakka). ఇందుకే సీతక్కను ఓడించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అయ్యిందంటూ కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చ..?!
కాంగ్రెస్ పార్టీ (Congress party) లో ఎలాంటి వివాదాలు లేని ఎమ్మెల్యే ఎవరు అంటే ఫస్ట్ వినిపించే పేరు ములుగు (Mulugu) ఎమ్మెల్యే సీతక్క ( MLA Sitakka) . ములుగు ప్రజల్లో ఆమె సంపాదించుకున్న ఆధరణకు అధికార పార్టీ నేతలు కూడా వెనకడుగు వేయక తప్పలేదు కొన్నిసార్లు. ఇక కరోనా టైం లో ప్రజలకు సీతక్క అందించిన సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు తిరుగులేని కీర్తిని తెచ్చిపెట్టాయి. సీతక్క అంటే ప్రజల మనిషి.. ప్రజల మధ్యే ఉండే మనిషి అనే బ్రాండ్‌ను క్రియేట్ చేశాయి. ప్రజల్లో ఇంత స్థాయి ఆధరణ సంపాదించిన వ్యక్తిని ఢీ కొట్టడం అంటే రాజకీయాల్లో కాస్త కష్టమైన పనే. ఇందుకే సీతక్కను ఓడించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అయ్యిందంటూ కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ములుగులో సీతక్కకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నుంచి బడే నాగజ్యోతికి టికెట్ ఇచ్చింది బీఆర్‌ఎస్ పార్టీ. నాగజ్యోతి కుటుంబ నేపథ్యం కూడా దాదాపు సీతక్క మాదిరిగానే ఉంటుంది.
సీతక్క ఉద్యమంలో ఉన్న సమయంలో నాగజ్యోతి తండ్రి కూడా ఉద్యమం లోనే ఉన్నారు. ఇద్దరి కుటుంబాలకు ములుగు ప్రజలతో మంచి అనుబంధం ఉంది. సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నా.. నాగజ్యోతి అక్కడి నుంచి జడ్పీటీసీగా గెలిచారు. ఈ లెక్కన ఇంకాస్త సపోర్ట్ ఇస్తే నాగజ్యోతి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశముందని బీఆర్‌ఎస్ పార్టీ భావించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆమెకు టికెట్ ఇవ్వడంతో పాటు.. నాగజ్యోతిని గెలిపించేందుకు భారీ ఖర్చుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ములుగులోని అన్ని ప్రాంతాల్లో మీటింగ్‌లు పెట్టి భారీగా జనసమీకరణ చేసే పనిలో ఉన్నారట బీఆర్‌ఎస్ నేతలు. కాంగ్రెస్ అధికారంలో వస్తే ఎలాంటి పరిణామాలు జరుగతాయో ప్రజలకు వివరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అయితే ప్రజలు ఈ ఎన్నికల్లో నాగజ్యోతి వైపు నిలబడతారా.. లేదా సీతక్కకే జై కొడతారా చూడాలి.