2024 YCP Manifesto Release : 2024 వైసీపీ మేనిఫెస్టో విడుదల.. మేనిఫెస్టోను రిలీజ్ చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వచ్చే నెలలో జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ సీఎం జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ బస్సు యాత్రలు చేస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న విషయం తెలిసిందే.. కాగా సీఎం జగన్ 2024 సార్వత్రిక ఎన్నికలకై వైసీపీ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 27, 2024 | 02:08 PMLast Updated on: Apr 27, 2024 | 2:21 PM

2024 Ycp Manifesto Release Cm Jagan Released The Manifesto

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వచ్చే నెలలో జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ సీఎం జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ బస్సు యాత్రలు చేస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న విషయం తెలిసిందే.. కాగా సీఎం జగన్ 2024 సార్వత్రిక ఎన్నికలకై వైసీపీ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. కాగా గతంలో 20219 ఎన్నికల్లో సీఎం జగన్ ఏ హామీలు ఇచ్చారు.. వాటిలో ఎన్ని అమలు చేశారు అని పూస గుచ్చినట్లు చేపుకోచ్చారు. దీంతో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సీఎం జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు.

2024 9 ముఖ్య హామీల (వైసీపీ) మేనిఫెస్టో…

సీఎం జగన్ గతంలో మాదిరి.. ఈసారి కూడా రెండు పేజీల మేనిఫెస్టోనే విడుదల చేశారు. ఇందులో 9 ముఖ్య హామీలను సీఎం జగన్ పొందుపరిచారు.

  1. అమ్మ ఒడి పథకం కింద ఇస్తున్న రూ.15వేలను రూ.17వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
  2. వైఎస్సార్ చేయూత నాలుగు విడతల్లో రూ.75వేల నుంచి రూ.లక్షా 50 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు
  3. రెండు విడతల్లో పింఛన్లు రూ.3500 చెల్లిస్తామని ప్రకటించారు (2028 జనవరిలో రూ.25, 2029 జనవరిలో 2029లో పెంపు)
  4. వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దశల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంపు
  5. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింది రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు
  6. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు విడతల్లో రూ.45వేల నుంచి రూ. లక్షా 5 వేలకు పెంపు
  7. కళ్యాణ మస్తు, షాదీ తోఫా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
  8. రైతు భరోసా కింద ఇచ్చే సొమ్మును
  9. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కచ్చితంగా ఇస్తామన్నారు

2024 YCP పూర్తి మేనిఫెస్టో..

  • 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ తప్ప మరొకటి లేదు…
  • అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత తదితర పథకాల కొనసాగింపు.
  • వైఎస్పార్ చేయూత పథకం 4 విడతల్లో రూ. 75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు
  • ‘అమ్మ ఒడి రెండు వేలకు పెంచుతాం. రూ. 17వేలు చేస్తాం.
  • తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తాం.
  • వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ (ఆరోగ్యశ్రీ పరిధిని ఇదివరకే రూ.25 లక్షలకు విస్తరించాం)
  • వైఎస్సార్ కావు నేస్తం పథకం కొనసాగింపు(నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంపు
  • నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంపు
  • వైస్సార్ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు.
  • కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు
  • మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేత.
  • వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం..
  • ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ.
  • ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేలు.
  • వాహన మిత్రను బడేళ్లలో రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతాం!
  • లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా
  • చేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు
  • వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు
  • లా నేస్తం కొనసాగింపు
  • అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు… ఇళ్ల పట్టాల కొనసాగింపు
  • నాడు-నేడు..ట్యాబ్ల పంపిణీ కొనసాగింపు..
  • 2025 నుంచి ఒకటో తరగతి బబీ సిలబస్.
  • ప్రతీ నియోజకవర్గంలో స్కిల్ హబ్..
  • జిల్లాకో స్కిల్టెవలప్మెంట్ కాలేజీ.
  • తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ
  • స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పని చేస్తున్న గిగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైస్సార్ బీమా వర్తింపు
  • వివిధ వర్గాలకు కొనసాగిస్తున్న సంక్షేమం గురించి మేనిఫెస్టోలో ప్రస్తానన

 

 

  • పెన్షన్ రూ.3,500కు పెంచుతాం: జగన్

వైఎస్సార్ పెన్షన్ కానుకను రెండు విడతల్లో రూ.3,500కు పెంచుతామని జగన్ ప్రకటించారు.జనవరి 1, 2028న రూ.250, జనవరి 1,2029న మరో రూ.250 పెంచుతామని జగన్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం పెన్షన్ నెలకు రూ.3,000 వస్తోందని, 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని జగన్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తామే ఎక్కువ మందికి, ఎక్కువ మొత్తం ఇస్తున్నామని పేర్కొన్నారు.

  • అమ్మఒడి నగదు రూ.17వేలకు పెంచుతాం: సీఎం

ప్రస్తుతం రాష్ట్రంలో అమ్మఒడి పథకం కింద ఇచ్చే నగదును రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో స్కూల్ బాగోగుల కోసం రూ.2 వేలు కేటాయించి, మిగతా రూ.15 వేలను తల్లుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. వైఎస్ఆర్ చేయూత కొనసాగిస్తామని.. ఐదేళ్లలో రూ.1,50,000 వరకు పెంచుతామన్నారు. కాపునేస్తాన్ని రూ.1,20,000 వరకు, ఈబీసీ నేస్తం రూ. లక్షా ఐదు వేల వరకు పెంచుతామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.

  • మరో 15 ఏళ్లు మా ప్రభుత్వం ఉండాలి: CM

దేశ చరిత్రలో తమ వైసీపీ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు. ‘కొవిడ్తో ఆర్థిక పరిస్థితి కుదేలైనా రాష్ట్రంలో ఏఒక్క పథకాం కూడా ఆపలేదు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మరో 15 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం ఉండాలి. 2014లో ఇదే కూటమి ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మారు. ఆ హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు బతుకులు ఛిన్నాభిన్నం అయ్యాయి. చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా? ప్రత్యేక హోదాను అమ్మేశారు’ అని చంద్రబాబుపై సీఎం జగన్ దుయ్యబట్టారు.

  • చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇవ్వాను.. CM జగన్

ఏపీ మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబులా నేను అబద్దపు హామీలు ఇవ్వాలని అనుకోవడం లేదు.. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి నిష్ఠగా అమలు చేశామని CM జగన్ తెలిపారు. ‘ప్రతి ఇంట్లో మా మేనిఫెస్టో ఉంది. 2019 మేనిఫెస్టోలో 99% పైచిలుకు హామీలను అమలు చేశాం. వీటి అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారు. కానీ సాధ్యం చేసి చూపించాం. చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయాలనుకోలేదు. చేయగలిగిన హామీలనే ప్రకటించి నిజాయితీగా అమలు చేశాం’ అని తెలిపారు.

SSM