Ethiopia, landslides : ఇథియోపియాలో హోరం.. కొండచరియలు విరిగిపడి 229 మంది మృతి..
ఇథియోపియాలో ఆదివారం భారీ వర్షంలో కొండచరియలు విరిగిపడ్డాయి విషయం తెలిసిందే.. ఈ ఘటనలో రెండు రోజుల వ్యవధిలో దాదాపు 229 మంది దుర్మరణం పాలయ్యారు.

229 people were killed in a landslide in Horam, Ethiopia.
ఇథియోపియాలో ఆదివారం భారీ వర్షంలో కొండచరియలు విరిగిపడ్డాయి విషయం తెలిసిందే.. ఈ ఘటనలో రెండు రోజుల వ్యవధిలో దాదాపు 229 మంది దుర్మరణం పాలయ్యారు. నిన్న గోఫాలోని గెజ్ ప్రాంతంలో 146 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కాగా ఈరోజు ఈ సంఖ్య 229 చేరుకుంది. ఇందులో పిల్లలు, గర్భీణులు, వృధ్దులు పెద్ద సంఖ్యల్లో ఉన్నారు. కాగా ఈ ఘటనలో ప్రజలను రక్షించే ప్రయత్నంలో మరి కొందరు మరణించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న తమవారిని ప్రాణాలతోకాపాడుతకునేందుకు స్థానికులు తీవ్ర ప్రయాత్నాలు చేస్తున్నారు. మరో వైపు మృతుల సంఖ్య వమరింత పెరి అవకాశం ఉందని గోఫా జోన్‌లోని విపత్తు శాఖ అధికారులు సంస్థ డైరెక్టర్ మార్కోస్ మెలేస్ వెల్లడించారు.
ఇథియోపియా వర్షాకాలంలో తరచు కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణమని.. ప్రతి సంవత్సరం ఇది జూలైలో ప్రారంభమై సెప్టెంబర్ ఇదే పరిస్థితి నెలకొంటుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఇథియోపియన్‌కు చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్.. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి మృతుల కుటుంబాలకు ఓదార్చి ప్రాణ నష్టం పై అంచాన వేస్తున్నట్లు WHO బృందం తెలిపింది.