Home »Latest » 27690under The Srdp Scheme Ambitiously Taken Up By The Brs Government As A Signal Free City 5evers Underpass Will Be Constructed Across The City Of Hyderabad As Part Of This The Steel Bridge Construct
Hyderabad Steel Bridge: హైదరాబాద్ సిగలో మరో అద్భుత ఫ్లై ఓవర్.. 100 ఏళ్లు నిలిచేలా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం..
సిగ్నల్ ఫ్రీ సిటీ లక్ష్యంగా ఇప్పటి వరకు "SRDP పథకం" కింద సిటీలో 33 ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. SRDP పథకంలో 36వ ప్రాజెక్టుగా ఇందిరా పార్క్ నుంచి VST వరకు నిర్మించిన "స్టీల్ బ్రిడ్జి" నగరవాసులకు రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.
Under the SRDP scheme ambitiously taken up by the BRS government as a signal free city 5evers underpass will be constructed across the city of Hyderabad As part of this the steel bridge constructed from Indira Park to VST will be made available to motorists tomorrow
హైదరాబాద్ సిగలో మరో మణిహారం ఉక్కు వంతెన
ఇందిరా పార్క్ – VST మధ్య 2.62 కి.మీ పొడవు నిర్మాణం
4 కూడళ్లను దాటడంతో 30 నిమిషాల ప్రయాణం.. ఇక కేవలం 5 నిమిషాల్లోనే
ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్.. విద్యా నగర్ రోడ్డు మీదుగా VST వరకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ఈ వంతెనపై గంటకు 40 కిలోమీటర్ల గరిష్ట వేగంతో మాత్రమే వెళ్లేందుకు అనుమతించారు.
ఈ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.450 కోట్ల అంచనా వ్యయం కాగా 12,500 మెట్రిక్ టన్నుల ఇనుమును ఉపయోగించారు.
భారతదేశంలో మొదటి పొడవైన స్టీల్ బ్రిడ్జి గా గుర్తింపు
మెట్రో మార్గం పై నుంచి వెళ్లడం ఉక్కు వంతెన మరో ప్రత్యేకత
స్టీల్ బ్రిడ్జ్ కు తెలంగాణ ఉద్యమ నేత, రాష్ట్ర తొలి హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహ్మారెడ్డి పేరు..
రేపు ఉదయం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభోత్సవం చేయనున్నారు.
SRDP పథకంలో భాగంగా 36 బ్రిడ్జి గా ప్రత్యేక నిర్మాణం