Lok Sabha, New MPs : 2024 లోక్ సభకు 280 మంది కొత్త ఎంపీలు.. తగ్గిపోయిన మహిళ ఎంపీలు
ఈసారి లోక్సభలో మెజారిటీ సభ్యులు కొత్తవారే కనిపించనున్నారు... 2024 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 50శాతం మంతి లోక్ సభలో కొత్తవారు అడుగుపెట్టనున్నారు. కాగా ఈ సారి మాత్రం చాలా వరకు యువ మహిళ ఎంపీలు తగ్గిపోయాయి.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు (General Elections) ముగిశాయి. మరి కొన్ని గంటల్లో కొత్త ప్రభుత్వం… కొలువుదిరనుంది. ఇప్పటికే 17వ లోక్ సభను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ రద్దు చేశారు. ఇక కొత్త ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయ్యడమే లేటు.. కాగా ఈ సారి చరిత్రలో ఎన్నడు లేని విధంగా దాదాపు 280 మంది కొత్తవారు లోక్ సభ లో అడుగుపెట్టబోతున్నారు.
ఈసారి లోక్సభలో మెజారిటీ సభ్యులు కొత్తవారే కనిపించనున్నారు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 50శాతం మంతి లోక్ సభలో కొత్తవారు అడుగుపెట్టనున్నారు. కాగా ఈ సారి మాత్రం చాలా వరకు యువ మహిళ ఎంపీలు తగ్గిపోయాయి. గత ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన.. అది ఇంకా అమలు కాకపోవడంతో మహిళలు తగ్గపోవడానికి ప్రధాన కరణం అని చెప్పవచ్చు.
తాజా ఎన్నికల్లో ఏకంగా 280 మంది తొలిసారి MPలుగా గెలిచారు. UP నుంచి 45, మహారాష్ట్ర నుంచి 33 మంది గరిష్ఠంగా ఎన్నికయ్యారు. కొత్తగా లోక్సభలో అడుగుపెట్టే వారిలో మాజీ CMలు శివరాజ్సంగ్, బొమ్మై, మనోహర్ లాల్ వంటి వారితోపాటు సినీనటులు కంగనా, సురేశ్ గోపి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో TG నుంచి 10, AP నుంచి 13 మంది కొత్తవారున్నారు.
ఈసారి లోక్సభలో మెజారిటీ సభ్యులు కొత్తవారే కనిపించనున్నారు. తాజా ఎన్నికల్లో ఏకంగా 280 మంది తొలిసారి ఎంపీలుగా గెలిచారు. తొలిసారిగా లోక్‌సభకు వస్తున్న సినీ నటుల్లో సురేశ్ గోపి, కంగనా రనౌత్ ఉన్నారు. ఇక 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి 45, మహారాష్ట్ర నుంచి 33 మంది లోక్ సభకు ఎన్నికయ్యారు. దీంతో పాటు కొత్తగా లోక్‌సభలో మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్, కర్ణటక మాజీ సీఎం బొమ్మై, మనోహర్ లాల్ వంటి వారు లోక్ సభలో అడుగు పెట్టబోతున్నారు. మరో వైపు భారత దేశ రాజ కుటుంబాలకు చెందిన ఛత్రపతి సాహు, యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్, కృతీ దేవిలు లోక్ సభ కు ఎన్నికయ్యారు.
కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. గతంలో రాజ్యసభ సభ్యుల్లుగా ఉన్న నేతలు.. ఈ ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నికయ్యారు. అనిల్‌దేశాయ్, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్రప్రధాన్, మాండవీయ, పురుషోత్తం రూపాలా లోక్‌సభకు వస్తున్నారు.
తెలుగు రాష్ట్రల నుంచి…
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి 10, ఎపీ నుంచి 13 మంది కొత్తవారున్నారు.