TSRTC JACK POT : 18 రోజుల్లో 340 కోట్ల ఆదాయం.. మహాలక్ష్మితో ఆర్టీసీకి సిరులు

తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ దారుణంగా నష్టాల్లో కూరుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ సంక్రాంతి సీజన్ లో మునుపెన్నడూ లేనివిధంగా TS ఆర్టీసీ 340 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. 50 లక్షల మంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. డైనమిక్ ఫేర్ సిస్టమ్ పేరుతో వసూలు చేసిన అదనపు ఛార్జీలతో ఆర్టీసికి సిరుల పంట పండింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 20, 2024 | 11:07 AMLast Updated on: Jan 20, 2024 | 11:07 AM

340 Crore Revenue In 18 Days Sirulu To Rtc With Mahalakshmi

తెలంగాణ (Telangana)లో మహిళలకు ఉచిత ప్రయాణం (Woman Free Travel)తో ఆర్టీసీ (RTC) దారుణంగా నష్టాల్లో కూరుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ సంక్రాంతి సీజన్ లో మునుపెన్నడూ లేనివిధంగా TS ఆర్టీసీ (TS RTC) 340 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. 50 లక్షల మంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. డైనమిక్ ఫేర్ సిస్టమ్ పేరుతో వసూలు చేసిన అదనపు ఛార్జీలతో ఆర్టీసికి సిరుల పంట పండింది.

మహిళలకు ఉచితబస్సు ప్రయాణంతో ఆర్టీసీకి లాభాల పంట పండింది. సంక్రాంతి పండక్కి ఊళ్ళకి వెళ్ళేవారు.. తిరిగి వచ్చేవాళ్ళతో గత 18 రోజుల్లో 50 లక్షల మంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దాంతో ఊహించని విధంగా ఆర్టీసీ 340 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించింది. గత ఏడాది ఇవే 18 రోజుల్లో ఆర్టీసీ ఆదాయం 245 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహా లక్ష్మి స్కీమ్.. ఇప్పుడు TS RTC కి కొత్త జీవితం ఇచ్చిందని అంటున్నారు. మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది ప్రభుత్వం. అయితే పండగ సందర్భంగా TS RTC నడిపిన ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు జీరో టిక్కెట్ అనుమతించారు. మహిళలు బస్సుల్లో వస్తుంటే.. వారి భర్తలు, కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళే పరిస్థితి ఉండదు.. అందుకే వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించారు.

కేవలం ఎక్స్ ప్రెస్ బస్సుల (Express Buses) ద్వారానే ఆర్టీసీకి ఇంత పెద్దమొత్తంలో ఆదాయం రాలేదు. పండగ సీజన్ సందర్భంగా నడిపిన సూపర్ లగ్జరీ, గరుడ బస్సుల్లో డైనమిక్ ఫేర్ సిస్టమ్ ను ప్రవేశపెట్టారు. దాంతో ఆర్టీసీ ఆదాయం బాగా పెరిగింది. అంటే ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉంటే.. తక్కువ ఛార్జీలు.. రద్దీగా ఉన్న టైమ్ లో ఎక్కువ ఛార్జీలను వసూలు చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ తో పోలిస్తే డైనమిక్ ఫేర్ తక్కువే ఉండటంతో.. ఎక్కువ మది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించారు. గత దసరా సందర్భంగా కూడా ఇలాంటి సిస్టమ్ తోనే ఆర్టీసీకి బాగా సంపాదించింది. జనవరి 17, 18 తేదీల్లో TSRTC కి 45 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు 101 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో 17వ తేదీ నాటికి సమకూరిన ఆదాయం కంటే ఈసారి 92 కోట్ల రూపాయలు అదనంగా వచ్చినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.