సౌదీలో బయటపడ్డ 4 వేల ఏళ్లనాటి నగరం, ఇళ్లలో ఏం దొరికాయంటే..

సౌదీ అరెబియా పేరు చెప్తే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేవి ఎడారులు. ఎడారులు అంటే నీటి చుక్క కూడా దొరకతు. ఇలాంటి ఎడారుల్లో నీళ్లు దొరికే ప్రాంతాలు ఒయాసిస్‌లు. ఇక్కడ నీళ్లకు ఎంత కరువు ఉంటుందంటే నీళ్లు దొరికే ప్రాంతాల్లోనే ఇళ్లు కట్టుకుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2024 | 09:34 PMLast Updated on: Nov 04, 2024 | 9:34 PM

4 Thousand Years Old City Found In Saudi What Was Found In These Houses

సౌదీ అరెబియా పేరు చెప్తే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేవి ఎడారులు. ఎడారులు అంటే నీటి చుక్క కూడా దొరకతు. ఇలాంటి ఎడారుల్లో నీళ్లు దొరికే ప్రాంతాలు ఒయాసిస్‌లు. ఇక్కడ నీళ్లకు ఎంత కరువు ఉంటుందంటే నీళ్లు దొరికే ప్రాంతాల్లోనే ఇళ్లు కట్టుకుంటారు. ప్రజలు నివాసముంటారు. ఈ లాజిక్‌ను బేస్‌ చేసుకుని అల్ నతాహ్ అనే ప్రదేశంలోని ఒయాసిస్ వద్ద ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన నగరాల గురించి పరిశోధన చేశారు. వాళ్ళ ప్రయోగాలకు ఫళితంగా టీమ్ జరిపిన తవ్వకాల్లో ఒక ప్రాచీన పట్టణం బయటపడింది. అది దాదాపు 4వేల ఏళ్ల కిందటిది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాని చుట్టూ జనావాసాలు ఉన్న ఆనవాళ్లను గుర్తించారు.

వీటికి సంబంధించిన ప్రాచీన అవశేషాలు అల్ నతాహ్ వద్ద పురావస్తు శాస్త్రవేత్తలకు దొరికాయి. సౌదీ అరేబియాలో ప్రాచీన ప్రజానీకం సంచార జీవనం గడిపేవారు. వారు కాలక్రమంలో ఒకేచోట స్థిరంగా నివసించడం మొదలుపెట్టారు. ఈక్రమంలోనే అల్ నతాహ్ అనే ప్రదేశంలోనూ కోటను నిర్మించుకొని నివసించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రాచీన పట్టణం చుట్టూ దట్టమైన ఎడారి ప్రాంతం ఉంది. ఈ పట్టణం చుట్టూ రక్షణ కోసం అప్పట్లో 14.5 కిలోమీటర్ల ఎత్తైన గోడను నిర్మించుకున్నారు. ఈ పట్టణం ప్రారంభ కాంస్య యుగంలో 2400 బీసీ కాలం నాటిది. ఈ పట్టణంలో అప్పట్లో 500 మంది నివసించే వారు. సౌదీ అరేబియాలో జరిగిన అతి ప్రాచీన పట్టణీకరణ అల్ నతాహ్‌ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రదేశంలోని కోట దాదాపు 2.6 హెక్టార్లలో విస్తరించిన ఉంది. ఈ పట్టణం సైజుపరంగా మెసపొటేమియా, ఈజిప్షియన్ నగరాల కంటే చిన్నదే. అయినప్పటికీ ఇది ప్రాచీన సౌదీ అరేబియా జీవన శైలి, జనాభా అవసరాలకు అద్దంపడుతోంది. మొత్తం మీద శాస్త్రవేత్లు సమర్పించిన ఈ నివేదిక ప్రాచీన నిర్మాణ రీతుల వివరాలను వెలుగులోకి తెచ్చింది.