Uttarakhand Uttarkashi : సొరంగంలో 41 మంది కార్మికులు.. ఆహారంగా కిచిడీ పంపిన అధికారులు
ఉత్తరాఖండ్ ఈ పేరు వినగానే ఇది వరకు ఇది వరకు పుణ్యక్షేత్రాలు, చోట చార్ ధామ్.. కేధార్ నాథ్, బద్రినాథ్, యమూనోత్రి, గంగోత్రి యాత్రలు గుర్తుకు వస్తుండే.. ఇప్పుడు వింటే మాత్రం ఈ రాష్ట్రం పేరు వింటే ఉత్తరకాశీలోని సొరంగం మాత్రమే గుర్తుకు వస్తుంది. నేటికి 10 రోజులు అవుతుంది. ఇంకా సొరంగంలో 41 మంది కూలీలు చిక్కుకుపోయారు.

41 workers trapped in the tunnel in Uttarkashi state of Uttarakhand. Officials sent Kichidi to the workers on the first day.
ఉత్తరాఖండ్ ఈ పేరు వినగానే ఇది వరకు ఇది వరకు పుణ్యక్షేత్రాలు, చోట చార్ ధామ్.. కేధార్ నాథ్, బద్రినాథ్, యమూనోత్రి, గంగోత్రి యాత్రలు గుర్తుకు వస్తుండే.. ఇప్పుడు వింటే మాత్రం ఈ రాష్ట్రం పేరు వింటే ఉత్తరకాశీలోని సొరంగం మాత్రమే గుర్తుకు వస్తుంది. నేటికి 10 రోజులు అవుతుంది. ఇంకా సొరంగంలో 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ విశ్వప్రయాత్రాలను చేసిన అవి ఫలించడం లేదు.
Onion Prices : కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధర .. తగ్గేదే లేదంటూ 70 చేరిన ఉల్లి
నవంబర్ 12 తెల్లవారుజామున 4 గంటలకు కొండచరియలు విరిగి సొరంగం మూసుకుపోతుంది. అదే సమయంలో పనిలో నిమగ్నమై ఉన్న 41 మంది కూలీలు టర్నకు అవతి వైపులో చిక్కుకుపోయారు. ఆ కార్మికులతో ఉన్న వాకిటాక్ తో కార్మికులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.. కానీ ఇక్కడ వారికి ఏ ఆహారం ఇస్తున్నారు.. ఎలా ఇస్తున్నారు..? అన్న ప్రశ్న అంది మదిలో వ్యక్తమవుతుంది. నవంబర్ 20న అధికారులు ఆరు అంగుళాల కొత్త పైప్ లైన్ ద్వారా మొదటి సారిగా వారికి కిచీడీ ని ఆహారాన్ని అధించారు అధికారులు.
వీరికి ఏ ఆహారం పడితే ఆ ఆహారం పెట్టకూడదు.. దాదాపు 10 రోజులుగా వారి శరిరంపై ఎండ తగలలేదు.. వారి శరిరం చాలా నిరసించి ఉంటుంది. పడలేని ఫుడ్ పడితే .. అవి ఇతర అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి.. అందుకే అధికారులు వైద్యులను సంప్రదించి కార్మికులకు ఓ టార్ ప్రిపేర్ చేశారు అధికారులు. కార్మికులు బయటకు వచ్చే వరకు.. కేవలం అరటిపండ్లు, యాపిల్స్, కిచిడీ, గంజి మాత్రమే పంపించాలని డాక్టర్ సూచించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ ఇన్‌ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ అరటిపండ్లు, యాపిల్స్, కిచిడీ, గంజి మొదలైనవి బాధితులకు పంపిస్తున్నాము అంటూ చెప్పుకోచ్చారు.
సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం ప్రత్యేకంగా హేమంత్ అనే కుక్ వంటి భాత్యతలు తీసుకున్నారు. మొదటి రోజు కిచిడీ’ని తయారు చేసి కార్మికులకు పంపించారు. కార్మికులకు వేడి వేడి ఆహారాన్ని పంపడం ఇదే తొలిసారి అని హేమంత్ తెలిపారు. తాను అధికారులు చెప్పిన ఆహారాన్ని మాత్రమే వండుతున్నానని.. వాటిని మాత్రమే కార్మికులకు పంపిస్తున్నామని మీడియాతో చెప్పుకోచ్చాడు.
బ్రహ్మఖల్-యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్‌లో కొంత భాగం నవంబర్ 12న కూలిపోయింది. చార్ ధామ్ యాత్ర ప్రాజెక్ట్ కింద, బ్రహ్మఖల్- యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా- దండల్‌గావ్ మధ్య ఈ సొరంగం నిర్మితమవుతోంది.
S.SURESH