52/2 నుంచి 53 ఆలౌట్ క్రికెట్ లో సంచలనం

క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోవచ్చు... ఓటమి ఖాయమనుకున్న టీమ్ గెలవొచ్చు.. అలాగే భారీస్కోర్ చేస్తుందనుకున్న జట్టు అనూహ్యంగా ఆలౌట్ అవ్వొచ్చు. ప్రస్తుతం ఆసీస్ దేశవాళీ క్రికెట్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 25, 2024 | 06:41 PMLast Updated on: Oct 25, 2024 | 6:41 PM

52 2 To 53 All Out A Sensation In Cricket

క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోవచ్చు… ఓటమి ఖాయమనుకున్న టీమ్ గెలవొచ్చు.. అలాగే భారీస్కోర్ చేస్తుందనుకున్న జట్టు అనూహ్యంగా ఆలౌట్ అవ్వొచ్చు. ప్రస్తుతం ఆసీస్ దేశవాళీ క్రికెట్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 52/2 స్కోరుతో ఉన్న జట్టు, కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే జోడించి 53 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఏకంగా ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఎన్నో రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ పెర్త్‌లో జరిగింది. ఆస్ట్రేలియా వన్డే కప్‌లో బాగంగా వెస్ట్రరన్ ఆస్ట్రేలియా, టాస్మానియా జట్లు తలపడ్డాయి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. 20.1 ఓవర్లలో 53 పరుగులకు ఆలౌట్ అయ్యింది..

52 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా తర్వాత కుప్పకూలింది. అది కూడా 1 పరుగు తేడాతో అనూహ్యంగా ఆలౌటైంది. 52 పరుగుల దగ్గరే మరో 5 వికెట్లు పడ్డాయి. తర్వాత ఎక్స్‌ట్రా రూపంలో ఒక్క పరుగు రావడంతో మళ్లీ స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. మళ్ళీ 53 పరుగుల వద్ద వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన వెస్ట్రరన్ ఆస్ట్రేలియా.. ఏకంగా ఆరు డకౌట్లు నమోదు చేసింది. ఈ లక్ష్యాన్ని 8.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది తస్మానియా.. ఈ మ్యాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎందుకంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ లో తొలి మ్యాచ్ ఇదే వేదికలో జరగబోతోంది.

స్వదేశంలోనే ఇటీవల కివీస్ పేస్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడిన మన బ్యాటర్లు పెర్త్ పిచ్ పై ఎంతవరకూ నిలుస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఆసీస్ పేస్ ఎటాక్ కు పెర్త్ పిచ్ తోడైతే మన బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. సిరీస్ లో తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న పెర్త్ లో ఇలాంటి పిచ్ ఉంటే మాత్రం ఏ జట్టు బ్యాటర్లకైనా సవాల్ గానే ఉంటుంది. ఇదిలా ఉంటే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే మిగిలిన 7 టెస్టుల్లో భారత్ కనీసం 4 గెలిచి తీరాల్సిందే. కివీస్ తో పుణే టెస్టులో వెనుకబడిన రోహిత్ సేన సిరీస్ కోల్పోతే మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నట్టే. న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకి వెళుతుంది. ఈ సిరీస్ లో ఐదు టెస్టులు ఆడనున్న భారత్ కనీసం 4 గెలిస్తే తప్ప డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తుపై ఆశలు పెట్టుకోలేం.