55 మంది మృతి.. 250 మంది సీరియస్ మయన్మార్‌లో మృత్యుఘోష
మయన్మార్‌లో, బ్యాంకాక్‌లో వచ్చి భూకంపం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మయన్మార్‌లో ఇప్పటి వరకూ 55 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు.థాయల్యాండ్‌లో నలుగురు వ్యక్తులు చనిపోయినట్టు చెప్తున్నారు.

మయన్మార్‌లో, బ్యాంకాక్‌లో వచ్చి భూకంపం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మయన్మార్‌లో ఇప్పటి వరకూ 55 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు.థాయల్యాండ్‌లో నలుగురు వ్యక్తులు చనిపోయినట్టు చెప్తున్నారు. ఈ రెండు ఘటనల్లో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిపోయిన బిల్డింగ్‌ల శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నారు. భూకంప ప్రభావం ఉన్న అన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. ఈ ఘటనలో మృతు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ స్పందించారు. థాయిల్యాండ్, మయన్మార్‌కు అన్ని విదాలా అండగా ఉంటామంటూ ట్వీట్ చేశారు. ఇక మయన్మార్‌తో పాటు భారత్‌లో కూడా పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. మేఘాలయలో రిక్టర్ స్కేల్ మీద 4 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత నమోదైంది. భారత్‌లో ప్రభావం అంతగా లేకపోయినా.. మయన్మార్, బ్యాంకాక్‌లో మాత్రం మృత్యు ఘోష కనిపిస్తోంది.