Budget funds to Maldives : మాల్దీవులకు 600 కోట్లు… కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు ?
మాల్దీవుల (Maldives) అధ్యక్షుడిగా మొహమ్మద్ మయిజ్జు (Mohammad Maijju) బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ తో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆయన చైనా అనుకూల నినాదంతో అధికారంలోకి రావడం... భారత్ సాయం అక్కర్లేదని తమ దేశంలో ఉన్న భారతీయ సైనికులు వెళ్ళిపోవాలని అల్టిమేటం కూడా ఇచ్చారు.
మాల్దీవుల (Maldives) అధ్యక్షుడిగా మొహమ్మద్ మయిజ్జు (Mohammad Maijju) బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ తో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆయన చైనా అనుకూల నినాదంతో అధికారంలోకి రావడం… భారత్ సాయం అక్కర్లేదని తమ దేశంలో ఉన్న భారతీయ సైనికులు వెళ్ళిపోవాలని అల్టిమేటం కూడా ఇచ్చారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ (Lakshya Deep) పర్యటనపై మాల్దీవుల మంత్రులు కామెంట్ చేయడంతో రెండు దేశాలమధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. మనోళ్ళు బాయ్ కాట్ మాల్దీవులకు పిలుపు ఇవ్వడంతో ఆ దేశానికి వెళ్ళే పర్యాటకుల సంఖ్య కూడా బాగా పడిపోయింది.
ఇంత గొడవ జరుగుతున్నా… మాల్దీవులు అంటే భారతీయులు మండిపడుతున్న వేళ ఆ దేశానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పక్క దేశాలతో బంధాలు బలోపేతం చేసుకోవడంలో భాగంగా మన బడ్జెట్ లో మాల్దీవులకు రూ.600 కోట్లను కేటాయించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman). పొరుగు దేశాలతో బంధాలను బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే గత ఏడాదితో పోలిస్తే… ఇప్పుడు మాల్దీవుల నిధుల్లో 50శాతం కోత విధించారు. 2023-24 బడ్జెట్‌లో మాల్దీవుల అభివృద్ధికి రూ.400కోట్లు ప్రపోజల్స్ పెట్టారు. కానీ అంతకంటే ఎక్కువగానే దాదాపు రూ. 770కోట్లు ఖర్చు అయ్యాయి. సవరించిన అంచనాల ప్రకారం ఖర్చు పెరిగింది. దాంతో పోలిస్తే… ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన అమౌంట్ 22 శాతం తగ్గిందని చెప్పుకోవాలి.
పొరుగు దేశాలకు నిధులు మామూలే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రతియేటా కేటాయింపులు జరపడం మామూలే. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పద్దుల కోసం మొత్తం 22 వేల 154 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇందులో భూటాన్(Bhutan) కు రూ. 2068 కోట్లు..నేపాల్ (Nepal) కు రూ. 700 కోట్లు…ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్(Bangladesh)కు రూ.120 కోట్లు కేటాయించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఇరాన్‌తో అనుసంధానమైన ప్రాజెక్టుల కోసం, ఆ దేశంలో నిర్మిచాలనుకుంటున్నా చాబహార్ పోర్టు నిర్వహణకు రూ.100 కోట్లను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
జనరల్ గా పొరుగు దేశాలతో సంబంధాలను బట్టి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్, లైన్ ఆఫ్ క్రెడిట్, టెక్నాలజీ సహకారం లాంటి వాటికి సాయం చేస్తుంది. వాణిజ్యం, ఇంధన, ఆరోగ్య రంగాలు, ఇంజినీరింగ్, ఐటీ, ఆటలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనలకు ఈ నిధులను కేటాయిస్తారు.