7 నెలల పెళ్లి.. బంగారంతో బట్టలు, గిఫ్ట్‌లుగా 2కోట్ల వాచ్‌లు, స్వర్గం భూమికి దిగివచ్చిందా అనే లెవల్‌లో సెట్‌లు.. అంబానీ ఇంటి పెళ్లి గురించి ఇంకా మాట్లాడుకుంటోంది దేశం. ఏడు నెలల కింద ప్రీవెడ్డింగ్ పేరుతో మొదలైన పెళ్లి సందడి.. ఏడు నెలల పాటు సాగింది. కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా ! టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు.. క్రికెట్ నుంచి ఫుట్‌బాల్ వరకు.. ఇలా సినిమాల సినిమాల నుంచి రాజకీయాల వరకు.. వీఐపీ అని మార్క్ ఉన్న ప్రతీ ఒక్కరు.. అంబానీ పెళ్లిలో సందడి చేశారు. ఇంత ల్యావిష్ వెడ్డింగ్ చేశారు.. దీనివల్ల ఎవరికి లాభం.. అంబానీ ఇంటి పెళ్లి గురించి దేశం మాట్లాడుకుంటుంది కదా.. దేశానికి అంబానీ ఏం చేశారు.. అసలు టాటాలతో పోలిక వీళ్లకు కరెక్టేనా అనే చర్చ మొదలైంది ఇప్పుడు. అంబానీ ఏం చేసినా ప్రపంచం మాట్లాడుకునేలా చేస్తారు. చివరికి ఇంట్లో పెళ్లి అయినా సరే మార్కెటింగ్ స్ట్రాటజీలా వాడేస్తారు.. 5వేల కోట్లు ఖర్చు చేస్తే.. దాని వెనక 50వేల కోట్ల వ్యాపార ఆలోచన ఉంటుందన్నది నిజం. చిన్న బిజినెస్‌తో మొదలుపెట్టి.. అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన అంబానీ ప్రతీ నిర్ణయం వెనక, ప్రతీ చర్య వెనక వ్యాపారమే కనిపిస్తుంది. టాటాలు అలా కాదు. ఏ నిర్ణయం అయినా దేశం కోసమే ఉంటుంది. అందుకే నిజమైన దేశభక్తులు ఎప్పుడు టాటాలే అనేది మెజారిటీ జనాల అభిప్రాయం. అంబానీలకు, టాటాలకు ఈ విషయంలో చాలా తేడా ఉంది. రిలియన్స్ సంస్థల్లో పనిచేసేవాళ్లు ఉద్యోగంలానే ఫీల్ అవుతారు. టాటా సంస్థల్లో అలా కాదు. ఓ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. అలాంటి వాతావరణం క్రియేట్ చేశారు టాటాలు అంటారు చాలామంది. ఇక జీవనశైలిలోనూ అంబానీలకు, టాటాకు చాలా తేడా కనిపిస్తుంది. అంబానీ స్టైల్ ఆఫ్ లివింగ్‌లో ఆడంబరాలు కనిపిస్తే.. టాటాలో మాత్రం స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వం దర్శనమిస్తుంది. అధికారం, హోదా ఉన్నా.. రతన్ టాటా సాధారణ వ్యక్తిలా, సామాన్యుడిలానే కనిపిస్తారు. ఆంటిలియో అని అంబానీ భూతల స్వర్గాన్ని నిర్మించుకుంటే.. ఓ చిన్న ఇంట్లో.. తోటి ఉద్యోగితో కలిసి రతన్ టాటా సాధారణ జీవితం గడుపుతున్నారు. రతన్ టాటా పెద్ద వ్యాపారవేత్త అయినా.. అవసరమైనప్పుడు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తారు. డాబు దర్పం ప్రదర్శించాలన్న ఆలోచన లేదు. ఈ విషయంలో రతన్ టాటాను టచ్ చేసే స్థాయిలో కూడా అంబానీ కనిపించరు. ఆస్తులు చూపించుకోవడంలో, ప్రకటించుకోవడంలో.. ప్రపంచంలోనే సంపన్నుడు అనిపించుకోవడంలో.. అంబానీ పోటీ పడితే.. సామాజిక సేవ, ఆపన్నులపై ప్రేమ మాత్రమే చాలు అన్నట్లు కనిపిస్తారు రతన్ టాటా. ఇది చాలదా నిజమైన దేశభక్తులు ఎవరో చెప్పడానికి ! టాటా నికర ఆస్తుల విలువ 3వేల 5వందల కోట్లు. ఇంతటి భారీ సంపద ఉన్నప్పటికీ, పారిశ్రామికవేత్తగా సంపన్నుడి స్థానంలో ఆయనకు చోటు దక్కలేదు. దీనికి కారణం టాటా ట్రస్ట్‌ల ద్వారా ఆయన చేస్తున్న భారీ విరాళాలు, దాతృత్వ కార్యక్రమాలే. టాటా సన్స్ సంస్థ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 66 శాతం ఆరోగ్యం, విద్య, ఆరోగ్యం, కళలు, సంస్కృతి సహా అనేక సామాజిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నారు. సామాజిక సేవ విషయంలో రతన్ టాటాకు అంబానీ అసలు పోటీనే కాదు. సంపాదించిన ప్రతీ రూపాయిలో.. అంతో ఇంతో సమాజానికి ఖర్చు చేయాలి.. వచ్చే ప్రతీ పైసా సమాజానిదే అనుకునే టాటా ఎక్కడ.. ఆస్తులను పోగేయడం మాత్రమే తెలిసిన అంబానీ ఎక్కడ. అంబానీ వ్యాపారవేత్త.. టాటా మాత్రం పారిశ్రామికవేత్త. ఇండియా సూపర్ పవర్‌గా ఎదగాలని అంబానీ అనుకుంటే.. ఇండియా హ్యాపీగా ఉండాలని టాటా అనుకుంటాడు. ఇది చాలదా.. దేశం మీద ఎవరికి ప్రేమ.. జనాల మీద ఎవరికి ఆప్యాయత అని చెప్పడానికి ! 5వేల కోట్లతో పెళ్లిళ్లు.. లక్షల కోట్ల రికార్డులు.. కొన్ని రోజులకు జనాలు మర్చిపోవచ్చు.. టాటా చేసిన సాయం.. చరిత్ర ఉన్నన్ని రోజులు ఉంటుంది.. ఇదే చరిత్ర మాట్లాడుకుంటుంది. ప్రపంచ వ్యాపార రంగంలో రతన్ టాటాలాంటి అత్యున్నతమైన వ్యక్తి.. నేటికాలంలో అసలు లేరు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందరో మహానుభావులు.. అందులో రతన్ టాటా.. లివింగ్ లెజెండ్ అన్నది మాత్రం క్లియర్.