2 నెలల్లో 800 కోట్ల స్పామ్‌ కాల్స్‌, ఆదమరిస్తే అంతే సంగతి

స్పామ్‌ కాల్స్‌ను కట్టడి చేసే దిశగా టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఏఐ ఆధారిత సొల్యూషన్లు ప్రవేశపెట్టిన రెండున్నర నెలల టైంలోనే ఏకంగా 800 కోట్ల స్పామ్ కాల్స్‌ను, 80 కోట్ల మెసేజీలను గుర్తించినట్లు తెలిపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 10, 2024 | 07:09 PMLast Updated on: Dec 10, 2024 | 7:09 PM

8 Billion Spam Calls In 2 Months Thats All It Takes

స్పామ్‌ కాల్స్‌ను కట్టడి చేసే దిశగా టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఏఐ ఆధారిత సొల్యూషన్లు ప్రవేశపెట్టిన రెండున్నర నెలల టైంలోనే ఏకంగా 800 కోట్ల స్పామ్ కాల్స్‌ను, 80 కోట్ల మెసేజీలను గుర్తించినట్లు తెలిపింది. అలాగే ప్రతీ రోజు దాదాపు పది లక్షల మంది స్పామర్లను గుర్తిస్తున్నట్లు వివరించింది. తమ నెట్వర్క్‌కు సంబంధించి మొత్తం కాల్స్‌లో ఆరు శాతం, మొత్తం మెసేజెస్‌లలో 2 శాతం స్పామ్ ఉంటున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఢిల్లీ వాసులకు అత్యధికంగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. అలాగే అత్యధిక కాల్స్ కూడా అక్కడి నుంచే జనరేట్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఇలాంటి కాల్స్‌ను అందుకుంటున్న కస్టమర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ తర్వాత స్థానంలో ఉంది.

ఈ రెండున్నర నెలల్లో అనుమానాస్పద కాల్స్, మెసేజెస్‌ గురించి దాదాపు 25 కోట్ల 2 లక్షల మంది కస్టమర్లని అప్రమత్తం చేసిందట ఎయిర్‌టెల్‌. దీంతో వాటికి స్పందించే వారి సంఖ్య సుమారు 12 శాతం తగ్గిందని ఎయిర్ టెల్ వివరించింది. స్పామర్లలో అత్యధికంగా 35 శాతం మంది ల్యాండ్లైన్ ఫోన్లను ఉపయోగిస్తున్నారట. అలాగే, పురుష కస్టమర్లే లక్ష్యంగా 76 శాతం కాల్స్ ఉంటున్నాయని వివరించింది. లావాదేవీలు, సర్వీస్‌కు సంబంధించిన కాల్స్ చేసేందుకు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, స్టాకర్లు, ఇతర ఆర్థిక సంస్థలు, కార్పొరేట్లు, ఎస్ఎంఈలకు ప్రభుత్వం 160 సిరీస్‌లలో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్లను కేటాయించినట్లు వివరించింది. డునాట్ డిస్టర్స్‌నిఎంచుకోని వారికి, ప్రమోషనల్ కాల్స్‌ను అందుకునేందుకు అంగీకరించిన వారికి యథాప్రకారం 140 సిరీస్లో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్ల నుంచే కాల్స్ వస్తాయని పేర్కొంది.

ఢిల్లీ, ముంబై, కర్ణాటక నుంచి అత్యధికంగా స్పామ్ కాల్స్ జనరేట్ అవుతున్నాయి. గుజరాత్, కోల్కతా, ఉత్తర్ ప్రదేశ్‌ నుంచి స్పామ్‌ మెసేజెస్‌ ఉంటున్నాయి. 36 నుంచి 60 వేళ్ల వయసున్న కస్టమర్లు లక్ష్యంగా 48 శాతం కాల్స్ ఉంటున్నాయి. 26 శాతం కాల్స్‌లో 26-35 ఏళ్ల వారు రెండో స్థానంలో ఉన్నారు. సీనియర్ సిటిజన్లకు 8 శాతం స్పామ్ కాల్స్ మాత్రమే వచ్చాయి. 15 వేల నుంచి 20 వేలు విలువ చేసే ఫోన్లు వాడేవాళ్లకు ఈ స్పామ్‌ కాల్స్ ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించింది ఎయిర్‌టెల్‌. ప్రతీ ఒక్కరికీ వచ్చే కాల్స్‌లో సగటుని 22 శాతం స్పామ్‌కాల్సే ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఉదయం 9 నుంచి మొదలుపెడితే రాత్రి వరకూ వీటి పరంపర కొనసాగుతూనే ఉంటోంది. ఇక ఆదివారాలు వీటి లెక్క చెప్పేందుకు కూడా వీలు లేని స్థాయిలో ఉంటోందట. ఈ స్థాయిలో ఇబ్బంది ఎదురవుతోంది కాబట్టే స్పామ్‌ కాల్స్‌ను కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి టెలికాం కంపెనీలు.