TAPPING RAOS : ఫోన్ టాపింగ్ ఉచ్చులో రావుల బ్యాచ్
దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో చాలామంది రావులు అడ్డంగా దొరికారు. ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణలో ఒక వర్గం, ఒక కులం ఎలా చెలరేగిపోయిందో తెలియడానికి ఫోన్ టాపింగ్ వ్యవహారం ఉదాహరణగా నిలిచింది. KCR పదేళ్ల ప్రభుత్వంలో వెలమలు... ప్రభుత్వ కార్యక్రమాల్లో, పోలీస్ వ్యవహారాల్లో ఎలా అడ్డంగా దూరి పోయారో, ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలో తెలియాలంటే టాపింగ్ వ్యవహారం ఒక మచ్చు తునక.
దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో చాలామంది రావులు అడ్డంగా దొరికారు. ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణలో ఒక వర్గం, ఒక కులం ఎలా చెలరేగిపోయిందో తెలియడానికి ఫోన్ టాపింగ్ వ్యవహారం ఉదాహరణగా నిలిచింది. KCR పదేళ్ల ప్రభుత్వంలో వెలమలు… ప్రభుత్వ కార్యక్రమాల్లో, పోలీస్ వ్యవహారాల్లో ఎలా అడ్డంగా దూరి పోయారో, ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలో తెలియాలంటే టాపింగ్ వ్యవహారం ఒక మచ్చు తునక.
నమ్మకస్తులంటే కేవలం సొంత కులం వాళ్ళు, బంధువులు మాత్రమే అన్నట్లుగా ప్రతి వ్యవహారంలోనూ కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR)… వెలమల్ని పోషిస్తూ పదేళ్లపాటు ఎంత అరాచకంగా వ్యవస్థల్ని నడిపించారో అర్థమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తాన్ని నడిపిన ప్రణీత్ రావు (Praneet Rao) వెలమ కులస్తుడు. ఎస్సై నుంచి ఏకంగా DSPకి ప్రమోషన్ ఇచ్చి మరి ఇతనికి టాపింగు వ్యవహారాన్ని అప్పజెప్పారు కేసీఆర్ అండ్ బ్యాచ్. అసలు ఈ వ్యవహారం మొత్తానికి సూత్రధారి, పాత్రధారి అయిన ప్రభాకర్ రావు… కేసీఆర్ పాలనలో పోలీస్ వ్యవస్థను మొత్తం గుప్పెట్లో పెట్టుకున్నాడు. డీజీపీని డమ్మీని చేశారు. ఇంటెలిజెన్స్ మొత్తం ప్రభాకర్ రావు కిందే ఉంది.
ప్రణీత్ రావుకు ఎక్విప్ మెంట్ సమకూర్చడం దగ్గర నుంచి పోలీస్ శాఖలో మరికొందరు అధికారులను అతనికి అటాచ్ చేయడం… ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకోవడం లాంటి వ్యవహారాలన్నీ నడిపింది ప్రభాకర్ రావే. ఫోన్ టాపింగ్ వ్యవహారం బయటపడగానే ఫ్యామిలీతో విహారయాత్రకని బయలుదేరి… అట్నుంచి అటే అమెరికా పారిపోయాడు. ట్యాపింగ్ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన వాళ్లు భుజంగరావు, రాధా కిషన్ రావు, తిరుపతన్న. వీళ్ళలో భుజంగరావు, రాధా కిషన్ రావు ఇద్దరు రావులే. పోలీస్ డిపార్ట్మెంట్ లోనే అత్యంత అవినీతిమయమైన అధికారులుగా భుజంగరావు, రాధా కిషన్ రావు పాపులర్.
వీళ్లందరి కన్నా ముఖ్యమైన వ్యక్తి ఐ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు. మిగిలిన వాళ్లంతా పోలీస్ శాఖకు చెందినవాళ్ళయితే… ఇతను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తి. మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు. ట్యాపింగ్ పరికరాలను తీసుకురావడంతో పాటు వేర్వేరు చోట్ల వాటిని పెట్టించి… రాజకీయ నేతలు, వ్యాపారులు, మీడియా ప్రముఖులు, సెలబ్రిటీలు ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఐ న్యూస్ ఛానల్ ఆఫీసులో కూడా ట్యాపింగ్ కోసం ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ట్యాపింగ్ వ్యవహారం బయటపడగానే శ్రవణ్ రావు లండన్ పారిపోయాడు.
ఈ వ్యవహారం మొత్తం ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే జరిగింది. కాకపోతే ఇలాంటి దుర్మార్గ పనులన్నీ ప్రభుత్వ హయాంలో ఒకే కులం వాళ్లు కలిసి చేయడం అత్యంత బాధాకరం. కులం మన సమాజంలో ఎంతగా పాతుకుని పోయిందో… చివరికి ప్రభుత్వ వ్యవహారాల్లో, డిపార్మెంట్ లో కూడా కులమే ఎలా రాజ్యమేలుతుందో ట్యాపింగ్ వ్యవహారమే ఒక ఉదాహరణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరుగురుపై FIR చేస్తే అందులో ఐదుగురు రావులే. ఈ కేసులో ఇప్పుడు ఇద్దరు BRS కీలక నేతలు సంతోష్ రావు, దయాకర్ రావుకు పోలీస్ శాఖ నోటీసులు ఇచ్చింది. వీళ్ళు కూడా రావులే. ఇంకా హరీష్ రావు, తారక రామారావుకి కూడా త్వరలో ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం రావుల చుట్టే తిరుగుతోంది.