ZP Chairman Tula Uma : బీజేపీకి భారీ షాక్.. బీఆర్ఎస్ లో చేరుతున్న మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ..
బీజేపీ (BJP) పార్టీకి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) కు భారీ షాక్.. నేడు మాజీ జెడ్సీ ఛైర్మెన్ (Ex-ZP Chairman) తుల ఉమ (Tula Uma) బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకొనున్నారు.

A big shock for BJP Former ZP Chairman Tula Uma joining BRS
బీజేపీ (BJP) పార్టీకి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) కు భారీ షాక్.. నేడు మాజీ జెడ్సీ ఛైర్మెన్ (Ex-ZP Chairman) తుల ఉమ (Tula Uma) బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకొనున్నారు. ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న తుల ఉమ. బీజేపీ తరఫున వేములవాడ ( Vemulawada) నుంచి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ.. గత మూడు రోజులుగా తమ పార్టీలోకి రావలని కాంగ్రెస్,బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. స్వయంగా మంత్రి కేటీఆర్ తుల ఉమ కు ఫోన్ చేసి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ ఆదేశాలతో తుల ఉమ ఇంటికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్లెడ లక్ష్మీ నరసింహారావు స్వయంగా వెళ్లి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఏట్టకేలకు తుల ఉమ బీఆర్ఎస్ లో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది.