New Delhi, Bore Well : దేశ రాజధానిలో బోరు బావిలో చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi) లోని (Delhi) వికాస్ పురి కేషోపూర్ మండి సమీపంలో ఢిల్లీ జల్ బోర్డు (Water Board) ప్లాంట్ బోరుబావిలో (Borewell) ప్రమాదవశాత్తు ఓ చిన్నారి పడిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2024 | 10:30 AMLast Updated on: Mar 10, 2024 | 10:30 AM

A Child In A Bore Well In The National Capital Rescue Operation Is Ongoing

దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi) లోని (Delhi) వికాస్ పురి కేషోపూర్ మండి సమీపంలో ఢిల్లీ జల్ బోర్డు (Water Board) ప్లాంట్ బోరుబావిలో (Borewell) ప్రమాదవశాత్తు ఓ చిన్నారి పడిపోయింది. ప్రస్తుతం 40 అడుగుల లోతులో చిన్నారి చిక్కుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆదివారం నాడు తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఎన్‌డీఆర్ఎఫ్ (NDRF), ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 40 అడుగుల బోర్ వెల్ పైపు 1.5 అడుగుల వెడల్పు ఉంది. ఇన్‌స్పెక్టర్ ఇంచార్జీ వీర్ ప్రతాప్ సింగ్ (Veer Pratap Singh) నేతృత్వంలో ఎన్‌డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ ను రంగంలోకి దింపారు. బోరు బావికి సమాంతరంగా గుంత తొవ్వుతున్నారు.