భూమి తిరిగే వేగాన్ని తగ్గిస్తున్న చైనా డ్యామ్
కేవలం ఒక దేశం ఈ భూమి తిరిగే వేగం తగ్గడానికి కారణం అవుతోంది అంటే నమ్ముతారా. వినడానికి విడ్డూరంగా ఉంది కదా. కానీ ఇది నిజమే అంటున్నారు సైంటిస్టులు. చైనాలో ఉన్న ఓ డ్యామ్ కారణంగా భూ బ్రమణ వేగం తగ్గిందని చెప్తున్నారు.
కేవలం ఒక దేశం ఈ భూమి తిరిగే వేగం తగ్గడానికి కారణం అవుతోంది అంటే నమ్ముతారా. వినడానికి విడ్డూరంగా ఉంది కదా. కానీ ఇది నిజమే అంటున్నారు సైంటిస్టులు. చైనాలో ఉన్న ఓ డ్యామ్ కారణంగా భూ బ్రమణ వేగం తగ్గిందని చెప్తున్నారు. చైనాలో త్రీ గోర్జెస్ అనే డ్యామ్ ఉంది. ప్రపంచంలో ఇదే అన్నిటి కంటే పెద్ద డ్యామ్. ఇందులో ఏకంగా 10 ట్రిలియన్ గ్యాలన్ల నీళ్లు ఉంటాయి. చైనా దేశం ఈ నీటిని ఆ డ్యామ్‌లో స్టోర్ చేస్తోంది. ఇంత భారీ స్థాయిలో నీళ్లు ఒకే ప్రాంతంలో నిల్వ ఉండటం భూ బ్రమణ వేగంపై ప్రభావం చూపుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ డ్యామ్ కారణంగా ఇప్పటికే భూమి తిరిగి వేగం 0.06 సెకన్లు తగ్గిందని చెప్తున్నారు. దీని వల్ల సూర్యుడి నుంచి 2 సెంటీ మీటర్ల దూరం కూడా పెరిగిందని చెప్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే గ్యాప్ ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉందట. ఈ డ్యామ్ కారణంగా భవిష్యత్తులో పెను విపత్తులు, భూకంపాలు సంభవించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.