రేవంత్ పై పరువు నష్టం దావా, కోర్ట్ కీలక ఆదేశాలు

నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసుపై విచారణ జరిగింది. బీజేపీ నేత కాసం వేంకటేశ్వర్లు పరువునష్టం దావా వేయగా దానిపై రేవంత్ కు కోర్ట్ సమన్లు జారీ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2024 | 04:07 PMLast Updated on: Sep 25, 2024 | 4:07 PM

A Defamation Suit Was Filed And The Court Issued A Summons To Revanth

నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసుపై విచారణ జరిగింది. బీజేపీ నేత కాసం వేంకటేశ్వర్లు పరువునష్టం దావా వేయగా దానిపై రేవంత్ కు కోర్ట్ సమన్లు జారీ చేసింది. కేంద్రం లో బిజెపి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని రేవంత్ ప్రచారం చేశారని పిటీషన్‌ లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇది వరకే రేవంత్‌ రెడ్డికి సమన్లు జారీ చేసింది ప్రజాప్రతినిధుల కోర్టు

రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్ట్ కి తెలిపారు. దీంతో పర్సనల్ బాండ్‌, 15వేల పూచీకత్తుత సమర్పించాలని నాంపల్లి కోర్టు పేర్కొంది. విచారణ వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.