Snakes Jatara : పాములు మెడలో వేసుకుని జాతర.. ధైర్యం ఉన్నవాళ్లే ఈ వీడియో చూడండి
ఎన్నో సాంప్రదాయాలకు, ఆచారాలకు పుట్టినిల్లు మన దేశం. ఒకే దేశమైనా వేరు వేరు ప్రాంతాల్లో ఆచానా వ్యవహారాలు ఒక్కో రకంగా ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి, ఆచారాలను బట్టి పండగలు జరుపుకునే తీరు కూడా వేరేగా ఉంటుంది.

A fair where snakes are worn around the neck. Only those who have courage watch this video
ఎన్నో సాంప్రదాయాలకు, ఆచారాలకు పుట్టినిల్లు మన దేశం. ఒకే దేశమైనా వేరు వేరు ప్రాంతాల్లో ఆచానా వ్యవహారాలు ఒక్కో రకంగా ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి, ఆచారాలను బట్టి పండగలు జరుపుకునే తీరు కూడా వేరేగా ఉంటుంది. దానికి అనుగుణంగానే ఉత్సవాలు జరుపుతారు. ఇదే క్రమంలో ఓ ప్రాంతంలో ఏకంగా పాములతో జాతర నిర్వహిస్తున్నారు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ జాతర నిర్వహిస్తారు. సమస్తిపూర్‌లో ప్రతీ సంవత్సరం నాగ పంచమి రోజున ఈ అద్భుతమైన పాముల జాతర నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటారు. ఈ జాతరలో కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
ఈ పాముల జాతర గత మూడు వందల సంవత్సరాలుగా సంప్రదాయ పద్ధతిలో ఇక్కడివాళ్లు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సింఘియాలో నాగ పంచమి రోజున ఈ జాతర జరుగుతుంది. రాత్రంతా ప్రార్థనలు చేసిన తరువాత.. ప్రజలు ఊరేగింపుగా బయలుదేరి నదికి వెళతారు. స్నానం చేసి పాముకి పాలు, గుడ్డును భక్తితో సమర్పించుకుంటారు. ఇందులో వందలాది మంది పాములను పట్టుకునే వ్యక్తులు పాల్గొంటారు. వీళ్లను ఇక్కడ భగత్‌లు అని పిలుస్తారు. బుధి గండక్ నదిలో స్నానం చేసి. .ఆపై పాములను పట్టుకునే ఆట ప్రారంభమవుతుంది. గండక్ నదిలో స్నానం చేసి నీటిలో నుంచి పాములను చేతిలో పెట్టుకుని.. నోటిలో కరచుకుని బయటకు తీస్తారు.
పాములు తన స్నేహితులంటూ మెడకు, చేతులకు చుట్టుకుంటారు. అక్కడి నుంచి ఊరేగింపుగా.. భగత్ రామ్ సింగ్ మాతా విశ్వ హరి ఆలయానికి వెళతారు. నది నుంచి డజన్ల కొద్దీ పాములను బయటకు తీస్తుంటారు. వాటిలో చాలా విషసర్పాలు కూడా ఉంటాయి. నదిలో నుంచి ఎవరు ఎన్ని పాములను త్వరగా బయటకు తీయాలనే పోటీ కూడా ఉంటుంది. ఈ జాతర రోజున ఇక్కడి ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి వాళ్ల నమ్మకం. సిద్ధి పూర్తయిన తర్వాత నది నుంచి బయటకు తీసిన పాములను సురక్షిత ప్రదేశాల్లో వదిలేస్తారు. దేశం మొత్తం మీద కేవలం సమస్తిపూర్‌లో మాత్రమే ఇలా పాముల జాతర నిర్వహించబడుతోంది.