పొరపాటైంది క్షమించు బుమ్రా.. సారీ చెప్పిన ఇసా గుహ

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు మహిళా కామెంటేటర్ క్షమాపణలు చెప్పింది. తాను పొరపాటుగా మాట్లాడానని, క్షమించాలని కోరింది. గబ్బా వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 16, 2024 | 09:15 PMLast Updated on: Dec 16, 2024 | 9:15 PM

A Female Commentator Has Apologized To Team India Fast Bowler Jasprit Bumrah

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు మహిళా కామెంటేటర్ క్షమాపణలు చెప్పింది. తాను పొరపాటుగా మాట్లాడానని, క్షమించాలని కోరింది. గబ్బా వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. సహచరులు విఫలమవుతున్నా 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో బుమ్రాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే మహిళా కామెంటేటర్ గ వ్యవహరిస్తున్న ఇసా గుహ బుమ్రా పొగుడుతూ నోరు జారింది. మోస్ట్ వాల్యుబుల్ ప్రిమేట్ అనే పదం వాడింది. ప్రైమేట్ అంటే కోతి జాతికి చెందిన జంతువు. బుమ్రాను కోతితో పోల్చడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇసా గుహ తాజా వ్యాఖ్యలు 2008లో చోటు చేసుకున్న వివాదాస్పద మంకీ గేట్ ఘటనను గుర్తు చేసింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దివంగత ఆండ్రూ సైమండ్స్‌ను హర్భజన్ సింగ్.. మంకీ అన్నడానే ఆరోపణలతో వివాదం చోటు చేసుకుంది. పొరపాటును తెలుసుకున్న ఆమె వెంటనే బుమ్రాకు క్షమాపణలు చెప్పింది. ‘మ్యాచ్ సమయంలో కామెంట్రీ చేస్తూ ఓ పదం వాడాననీ, బుమ్రా ఘనతలను ప్రశంసించే క్రమంలో పొరపాటు పదం వాడినట్లు అనుకుంటున్నట్టు వివరణ ఇచ్చింది. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా అంటూ ఇషా గుహ తెలిపింది

తన మాటలు పూర్తిగా వింటే.. బుమ్రాను కొనియాడినట్లు మీకు అర్థమవుతోందని చెప్పుకొచ్చింది. టీమిండియా ఆటగాళ్లను తాను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడననీ స్పష్టం చేసింది. క్రికెట్ కోసం పాటుపడే వారికి కోసం అండగా ఉంటాననీ చెప్పింది. ఇదిలా ఉంటే
లైవ్ టెలికాస్ట్‌లో క్షమాపణలు చెప్పిన ఇసా గుహను టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కొనియాడాడు. పొరపాట్లు చేయడం సహజమని, ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్‌లో కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయని, వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగాలని సూచించాడు