బంతితో ఫ్లాప్.. బ్యాట్ తో హిట్ గబ్బాలో ఆకాశ్ దీప్ షో

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టాయిలెండర్లు అద్భుతం చేశారు. బ్యాటర్లు చేయాల్సిన పనిని బౌలర్లు బాధ్యత తీసుకుని జట్టు గౌరవాన్ని కాపాడారు. గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో బుమ్రా, ఆకాశ్ దీప్ కలిసి ఫాలో ఆన్‌ గండం నుంచి తప్పించారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ బ్యాటింగ్ అదిరిందనే చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 17, 2024 | 09:12 PMLast Updated on: Dec 17, 2024 | 9:12 PM

A Flop With The Ball A Hit With The Bat Akash Deeps Show At The Gabba

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టాయిలెండర్లు అద్భుతం చేశారు. బ్యాటర్లు చేయాల్సిన పనిని బౌలర్లు బాధ్యత తీసుకుని జట్టు గౌరవాన్ని కాపాడారు. గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో బుమ్రా, ఆకాశ్ దీప్ కలిసి ఫాలో ఆన్‌ గండం నుంచి తప్పించారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ బ్యాటింగ్ అదిరిందనే చెప్పాలి. బంతితో నిరాశపరిచిన ఈ బౌలర్ బ్యాట్ తో కీలక సమయంలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. బూమ్రాతో కలిసి జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. హార్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్ బంతితో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.బూమ్రాకు సరైన సపోర్ట్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యాడు. 30 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. కానీ బ్యాట్ తో చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. బంతితో ఫ్లాప్ అయినా బ్యాట్ తో అదరగొట్టాడంటూ మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.

ఇదిలా ఉంటే భారత్ ఫాలో ఆన్ తప్పించుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఆకాశ్ దీప్, బూమ్రా అద్భుతమే చేశారు. ఆకాశ్ దీప్ ఫోర్ కొట్టి ఫాలో-ఆన్ నుంచి భారత్‌ను కాపాడటంతో డగౌట్ లో ఉన్న కోహ్లీ ఎగిరిగంతేశాడు. గంభీర్, రోహిత్ తో సహా ఇతర ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో సంబరాలు చేసుకున్నారు. నిజానికి ఆకాశ్ దీప్ ఆడిన బ్యాట్‌ను విరాట్ కోహ్లీ అతనికి బహుమతిగా ఇచ్చాడు. ఈ విధంగా ఆకాష్‌దీప్, బుమ్రా భాగస్వామ్యంతో జట్టును గట్టెక్కించాడు. నాలుగో రోజు ఆటలో ఫాలో-ఆన్‌ను కాపాడుకోవడానికి భారత్‌కు 246 పరుగులు చేయాల్సి ఉండగా.. కేఎల్ రాహుల్, జడేజా భాగస్వామ్యం కాపాడింది. కేఎల్ రాహుల్ 84, జడేజా 77 పరుగులతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరు అవుట్ అవ్వడంతో భారత్ ఫాలో ఆన్ ఆడే ప్రమాదం ఉందని అంత టెన్షన్ పడ్డారు. కానీ ఆకాష్‌దీప్ ఆస్ట్రేలియాకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. బూమ్రాతో కలిసి అజేయంగా 39 పరుగులు జోడించాడు. చివర్లో ఆకాష్ దీప్ ఫోర్ కొట్టిన వెంటనే కెమెరామెన్ రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ మరియు విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న వారిని చూపించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్-గంభీర్ ఆనందంతో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది.