Taiwan Earthquake : తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం… తైవాన్, జపాన్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ
ఇవాళ ఉదయం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి తైపీలోని అనేక భవనాలు నేటమట్టమయ్యాయి.

A huge earthquake hit Taiwan's capital Taipei... Tsunami warnings were issued to Taiwan and Japan
ఇవాళ ఉదయం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి తైపీలోని అనేక భవనాలు నేటమట్టమయ్యాయి. కాగా భూకంప తీవ్రత రిక్టల్ స్కేలుపై 7.4 గా నమోదైంది. తూర్పు తైవాన్ (Taiwan) లోని హువాలియన్ నగరానికి 18కిలో మీటర్ల దూరంలో 34.8కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) (USGS)గుర్తించింది.
ఈ భూకంపం దాటికి భారీగా కొండచరియలు సైతం విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో పవర్ ప్లాంట్లు సైతం పూర్తిగా దెబ్బతినడంతో తైవాన్ రాజధానిలో విద్యుత్ సరఫర నిలిచిపోయింది.
ఈ భూంపం ప్రభావంతో తైవాన్, జపాన్ (Japan) పిలిప్పీన్స్ లో సునామీ (Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. భూకంపాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తైవాన్ ప్రభుత్వం తైపీ నగర ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎవరకు కూడా సముద్రం తీర ప్రాంతానికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. సముద్రం వద్దు 3 మీటర్ల ఎత్తులో.. దాదాపు 10 అడుగుల మేర ఎత్తులో రాకసీ అలలు ఎడసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ అంచనా వేసింది. తైవాన్, జపాన్, పిలిప్పీన్స్ ప్రజలు సముద్ర తీరం ప్రాంతంల్లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ భూకంపంతో పసిఫిక్ మహా సముద్రం నుంచి సునామీ ముప్పు లేకపోలేదని జపాన్ పర్యవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రకృతి విపత్తులో ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. ఆస్తీ నష్టాం మాత్రం భారీగా సంభవించినట్లు తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా తైవాన్ దేశంలో 1999లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించగా.. అందులో సూమారుగా 2 వేల మందికి పైగా మృతి చెందారు.
తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.4గా నమోదైంది.#Taiwan #earthquake #Taiwan #Earthquake #Tsunami #TaiwanEarthquake #China #ishigaki #Hualien #Japan #Terremoto #OKINAWA #landslide pic.twitter.com/9WSX9VUvTe
— Dial News (@dialnewstelugu) April 3, 2024