Kedarnath 2024 : కేదార్నాథ్ లో తప్పిన భారీ హెలికాప్టర్ ప్రమాదం.. నియంత్రణ కోల్పోయిన A119 కోలా హెలికాప్టర్
దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ ఆలయం వద్ద ఈ ఉదయం పెను హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. కేదార్నాథ్ లో భక్తులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పడంతో అక్కడి భక్తులు భయంతో పరుగుతు తీశారు.

A huge helicopter accident in Kedarnath.. A119 Kola helicopter lost control.
దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ ఆలయం వద్ద ఈ ఉదయం పెను హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. కేదార్నాథ్ లో భక్తులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పడంతో అక్కడి భక్తులు భయంతో పరుగుతు తీశారు. కాగా అది గమనించిన పైలెట్ వెంటనే అప్రమత్తం అయి హెలికాప్టర్ను సేఫ్ ల్యాండింగ్ చేసి భక్తులను ప్రాణాలతో బయట పడేశారు. అయితే హెలికాప్టర్ లో అంతరాయం ఎలా సంభవించిందనే దానిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
ఇక విషయంలోకి వెళితే..
Calsign VT-CLR యాజమాన్యంలోని లియోనార్డో A119 కోలా హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లో ల్యాండింగ్ కోసం కేదార్‌నాథ్ హెలిప్యాడ్ వద్దకు ఈరోజు ఉదయం 7:00 గంటలకు నియంత్రణ కోల్పోయింది. ఆరుగురు యాత్రికులతో (భక్తులు) వెళ్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో పైలెట్ హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సాంకేతిక లోపంతో పైలెట్ హెలికాప్టర్ ను ఎక్కువ దూరం తీసుకెళ్లలేకపోయారు. హెలికాప్టర్‌లోని సిబ్బంది.. ఆరుగురు ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అప్పుడు పైలట్ తెలివిగా హెలికాప్టర్ ల్యాండిక్ కోసం ఖాళీ స్థలం వెతికాడు. హెలిప్యాడ్ పాయింట్‌కు 100 మీటర్ల దూరంలో హెలికాప్టర్ చాకచక్యంగా ల్యాండ్ చేశాడు పైలట్.. దీంతో 6 యాత్రికులు.. అక్కడి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్ లో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ అయిన స్థలానికి కొద్ది దూరంలోనే ఓ గుంట ఉంది. క్షేమంగా హెలికాప్టర్ ను ల్యాండింగ్ చేసిన పైలెట్ కు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హెలికాప్టర్ లోని సాంకేతిక లోపాలను పైలట్ ముందే చెక్ చేసి ఉండాల్సిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేదార్ నాథ్ లో ఆ కేదార్ బాబాను దర్శించుకోవడానికి మూడు మార్గాలు మాత్రమే ఉన్నాయి. అందులో అతి సులవు అయిన మార్గం ఈ హెలిప్యాడ్.. తక్కువ సమయంలో కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడం అనే ఉద్దేశంతో చాలా మంత్రి యాత్రికులు ఈ హెలిప్యాడ్ ను బుకింగ్ చేసుకుంటారు. కాగా కేదార్నాథ్ కి హెలికాప్టర్ సేవ ఎప్పుడు ప్రమాదకరమే.. ఎందుకంటే అక్కడి వాతావరణ ప్రతి 5 నిమిషాలకు మారుతు ఉంటుంది. ఏ క్షణం లో వర్షం పడుతుందో.. క్షణంలో మంచు పడుతుందో.. క్షణంలో ఎండలు ఉంటాయి అసలు ఉహించలేం.. కాగా కేదార్నాథ్ లో గత 11 ఏళ్లలో 10 ప్రమాదాలు జరిగాయి.
Suresh SSM