Indus Hospital : విశాఖ జగదాంబ జంక్షన్ లోని ఇండస్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లోని ఇండస్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇండస్ ఆసుపత్రిలోని రెండో అంతస్థులో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆసుపత్రి మొత్తం దట్టమైన పొగ అలుముకోగా.. ఊపిరాడక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు రోగులు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకోని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

A massive fire broke out at Indus Hospital in Jagadamba Junction, Visakha
విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లోని ఇండస్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇండస్ ఆసుపత్రిలోని రెండో అంతస్థులో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆసుపత్రి మొత్తం దట్టమైన పొగ అలుముకోగా.. ఊపిరాడక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు రోగులు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకోని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాగా ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియదు. మంటల్లో చిక్కుకున్న రోగులను ఆస్పత్రి సిబ్బంది, ఫైర్ అధికారులు తరలిస్తున్నారు. ఫైర్ సిబ్బంది దాదాపు 40 మంది రోగులను బయటకు తీసుకొచ్చి.. వారిని అంబులెన్స్‌లలో వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆస్పత్రి భవనం మొదటి ఫ్లోర్‌లో ఉన్న ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెలరేగినట్లు అధికారులు అంచనా వేస్తున్నట్లు సమాచారం.. పోలీస్ కమిషనర్ రవిశంకర్ ప్రమాద స్థలానికి చేరుకోని సహాయక చర్యలను పర్యవేక్షుస్తున్నారు.