Orphaned children : అనాథ పిల్లలకు ఓ తల్లి బ్రెస్ట్ ఫీడింగ్.. వయనాడ్ విలయంలో కన్నీళ్లు పెట్టించే ఘటన..
కంటేనే అమ్మ కాదు.. కరుణించే ప్రతీ దేవత అమ్మే అని ఓ కవి చెప్పాడు. అమ్మ అంటే అమ్మ అంతే.. ఆకలితో ఏ బిడ్డ ఉన్నా.. ఏ బిడ్డ కన్నీళ్లు పెట్టుకున్నా.. చూస్తూ ఊరుకోదు ఆ గుండె.

A mother breast-feeding the orphans.. The incident in Wayanad Vilayam brings tears..
కంటేనే అమ్మ కాదు.. కరుణించే ప్రతీ దేవత అమ్మే అని ఓ కవి చెప్పాడు. అమ్మ అంటే అమ్మ అంతే.. ఆకలితో ఏ బిడ్డ ఉన్నా.. ఏ బిడ్డ కన్నీళ్లు పెట్టుకున్నా.. చూస్తూ ఊరుకోదు ఆ గుండె. వయనాడ్‌లో ఇలాంటి సన్నివేశమే కనిపించింది. ప్రకృతి ప్రకోపానికి వయనాడ్ వణికిపోతోంది. రాత్రికి రాత్రి ఆ ప్రాంతం తుడుచుపెట్టుకుపోయింది. వందల ప్రాణాలు తీసేసింది. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో.. ఎవరెవరు ఉన్నారో.. ఊహించుకోవడానికి లెక్కలేసుకోవడానికి కూడా గుండె బలం సరిపోవడం లేదు అంటే.. ఆ విలయం ఎంత విషాదమో అర్థం చేసుకోవచ్చు. కొండచరియలు విరిగిపడటంతో ఆత్మీయులను, చిన్నారులను కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు.
Kerala, Wayanad : కేరళలో శవాల కుప్పలు.. 200 దాటిన మృ*తుల సంఖ్య
ఈ విషాదంలో ఎంతోమంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. ఆ చిన్నారులు పెడుతున్న కన్నీళ్లు, ఆర్తనాదాలు.. ప్రతీ ఒక్కరి గుండెలను కదిలిస్తున్నాయ్. ఐతే అనాథలుగా మారిన చిన్నారుల విషయంలో ఓ మహిళ తీసుకున్న నిర్ణయం.. అమ్మ మనసుకు అద్దం పడుతోంది. అనాథ బిడ్డలను చూసుకుంటాం. తల్లిపాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ ఓ తల్లి చేసిన ప్రకటన ఇప్పుడు ప్రతీ ఒక్కరి మనసును మెలిపెడుతోంది. ఇడుక్కి ప్రాంతానికి చెందిన భావన అనే మహిళ.. వయనాడ్ విషాదంలో అనాథలుగా మిగిలిన చిన్నారులకు బ్రెస్ట్ ఫీడింగ్ చేసేందుకు రెడీ అంటూ ముందుకు వచ్చారు.
Mumps in kerala: కేరళలో పెరిగిపోతున్న గవద బిళ్లలు.. ఒక్క రోజే భారీ కేసులు నమోదు..!
ఆమె భర్త సాజిన్ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. భావన.. ఇద్దరు పిల్లల తల్లి. వయనాడ్ నుంచి ప్రాణభయంతో అందరూ పారిపోతుంటే.. భావన, సాజిన్ మాత్రం అక్కడికి చేరుకున్నారు. అనాథ పిల్లల ఆకలి తీర్చేందుకు సిద్ధం అయ్యారు. భావన చేస్తున్న సాయానికి.. సోషల్ మీడియా సలాం చేస్తుంది. కనిపిస్తే కాళ్లు మొక్కాలని ఉందని కొందరు.. నీ సాయం చరిత్ర గుర్తుంచుకుంటుందని ఇంకొందరు.. భావన సాయం పొగుడుతున్నారు. ఒకటి మాత్రం నిజం.. తల్లిని మించిన యోధురాలు ఎవరు లేరు. దానికి ప్రకృతి కూడా సలాం చేయాల్సిందే. వయనాడ్ చేరుకున్న భావన మీద ఇప్పుడు నెటిజన్లు గుప్పిస్తున్న ప్రశంసలు ఇవే.