Britain’s mother: ఒక్కరితో కాదు కూతురా.. వంద మందితో డేటింగ్ చెయ్..

నేటి సమాజం రోజుకో రకంగా మారుతుంది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. అందుకే సొంత తల్లి తన కూతురికి వంద మందితో డేటింగ్ చేయమని ప్రోత్సహించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకు ఇలా ఆమె ప్రవర్తించిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు చూడాల్సిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 3, 2023 | 05:21 PMLast Updated on: Aug 03, 2023 | 5:21 PM

A Mother In Britain Encouraged Her Daughter To Date By Giving 500 Dollars

నేటి యుగంలో ప్రేమ అంటే అరిచి గగ్గోలు పెడతారు తల్లిదండ్రులు. వీలైతే పరువు హత్యల వరకూ వెళ్లే సమాజాన్ని కూడా చూశాం. కానీ దగ్గరుండి మరీ కూతురిని డేటింగ్ కి పంపడం అంటే కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఇలాంటివి మన భారతదేశంలో ససేమేరా చోటు చేసుకోవు. అందుకే బ్రిటన్ లో వెలుగులోకి వచ్చింది. తల్లి, కూతురికి డేటింగ్ చేయమని సలహా ఇచ్చింది. దీనికోసం డేటింగ్ నిధిని కూడా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కూతురికి ఖర్చుల కోసం 500 డాలర్లు ఇచ్చి హాయిగా, సంతోషంగా డేటింగ్ చేయమని ప్రోత్సహించేవారు. ఇక సీన్ కట్ చేస్తే తన కూతురు తల్లి మాట నిలబెట్టడం కోసం ఏకంగా ఏడాది కాలంలో అక్షరాలా 100 మందితో డేటింగ్ చేసి చరిత్ర సృష్టించారు. తన అందంతో, మాటలతో, ముద్దు ముచ్చటతో అలరించి వారిని హక్కున చేర్చుకునేలా ప్రణాళికలు రచించారు. దీనికి అబ్బాయిలు ఆమె ఉచ్చులో పడిపోయే వారు. ఈ విషయాన్ని స్వయంగా యువతి సోదరి ఎలిస్ కేరొలీన్ తన టిక్ టాక్ వీడియోలో షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిగ్ గా మారింది.

ఇందులో మరో కొస మెరుపు ఏంటంటే.. తల్లి ఇచ్చిన ఆపరేషన్ డేటింగ్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేట్ కూడా చేసుకున్నారు. కేక్ తీసుకొని దానిపై 100 నంబర్ క్యాండిల్ ఉంచి కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ చిత్రాలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇలా చేసినందుకు తన తల్లి వద్ద నుంచి 500 డాలర్లను బహుమతిగా పొందారు. సొంత తల్లి అయిఉండి ఇలా ఎందుకు చేశారనే అనుమానం మీలో కలుగవచ్చు. దానికి ఆ మాతృమూర్తి ఇచ్చిన సమాధానం వింటే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. పెళ్లి తరువాత తన కూతురికి పురుషుల, భర్త పట్ల భయం, అనుమానం ఉండకూడదని, ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఇలా పది మంది అబ్బాయిలతో తిరగడం వల్ల వారిలో ఉండే మంచి, చెడు లక్షణాలతో పాటూ వారి నడవడి, ప్రవర్తన అర్థం అవుతుందని ఇది ఆమె వ్యక్తిగత జీవితానికి ఎంతగానో దోహదపడుతుందని సమాధానం ఇచ్చారు. బహుశా అమ్మ ఏం చేసినా బిడ్డల మంచికే అంటూ ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు అర్థం అవుతుంది. చెడులోనూ మంచి కోరుకోవడం అంటే ఇదేనేమో అని.

T.V.SRIKAR