Heeramandi : 300కు పైగా ఔట్ ఫిట్ల ను ట్రై చేశాం…!
సినిమా అంటే ఎవరైనా హీరో గురించే హీరోయిన్ గురించే మాట్లాడుకుంటారు. అదీ కాకపోతే ఫైట్ల గురించో.. గ్రాఫిక్స్ గురించో చెప్పుకుంటారు.
సినిమా అంటే ఎవరైనా హీరో గురించే హీరోయిన్ గురించే మాట్లాడుకుంటారు. అదీ కాకపోతే ఫైట్ల గురించో.. గ్రాఫిక్స్ గురించో చెప్పుకుంటారు.. ఇంకా లోతుగా చెప్పాలంటే కెమెరా పనితం, లోకేషన్ల గురించి డిస్కస్ చేస్తుంటారు. కానీ అవన్నీకాకుండా.. తాజాగా ఓ సిరిస్ లో ప్రత్యేకంగా ఒక జంట గురించే మాట్లాడుకుంటున్నారు.
హీరామండీ.. ప్రజెంట్ ఓటీటీ (OTT) లో సంచలనం సృష్టిస్తున్న వెబ్ సిరీస్.. హిందీ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ స్వయంగా నిర్మించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలై టాప్ 10లో దూసుకుపోతోంది. స్వాతంత్య్రానికి ముందు లాహోర్‌లోని హీరామండీలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సిరీస్ రూపొందించారు. ముఖ్యంగా ఈ సిరీస్ లో కళ్లు మిరిమిట్లు గొలిపే సెట్టింగ్స్, ఖరీదైన లైట్లు, బంగారం, వెండి, విలువైన రత్నాలు, అద్భుతమైన కెమెరా పనితనం సినిమాలో ఒక ఎత్తు అయితే.. కాస్ట్యూమ్స్ మరో ఎత్తుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు ధరించిన లెహంగాలు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో అసలు వాటి డిజైన్లు ఎవరు అనేది చాలామందిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
హీరామండీకి క్యాస్టింగ్ డిజైనర్స్ గా పనిచేసింది రింపుల్, హర్ ప్రీత్ నరూల ద్వయం. తన సినిమాల్లో కాస్ట్యూమ్స్ విషయంలో ఏమాత్రం రాజీపడని దర్శక ధీరుడు భన్సాలీని.. తన ప్రయత్నంతో మెప్పించారు ఈ జంట. శతాబ్దం కాలం నాటి ఫ్యాషన్ శైలిని ప్రతిబింబించేలా, లగ్జరీగా డిజైన్ చేసిన దుస్తులతో ఈ సిరీస్‌లోని పాత్రలకు ప్రాణం పోశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలోఈ సిరీస్ కోసం పడిన కష్టాన్ని వివరించారు. నగల విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. చౌకర్లు, లాంగ్ నెక్లెస్ లతో పాటు కాలు కనబడకుండా డిజైన్ చేసిన డ్రెస్ లు అందరిని ఫిదా చేస్తున్నారు. అంతేకాక హీరోయిన్లుకు తగ్గట్లుగా డ్రెస్ లను డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారు
సినిమా అంతా అవిభజిత పంజాబ్ బ్యాక్ డ్రాప్ లో నడవడం, తాను పుట్టి పెరిగిదంతా పంజాబ్ లోనే కావడంతో క్యాస్టూమ్స్ చేయడం సులువైందని చెప్పుకొచ్చాడు హర్ ప్రీత్. తన నానమ్మ, అమ్మమ్మలు చెప్పిన కథలు కూడా అప్పటి వస్త్రాధారణ ఎలా ఉంటుందో అవగాహన తెచ్చాయని, హీరామండి కోసం అవి ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించాడు. ఈ సినిమా కోసం రెండేళ్ల పాటు కష్టపడ్డామని, 300కు పైగా ఔట్ ఫిట్లను రూపొందించినట్టు చెప్పాడు. ఈ సిరీస్ ప్రపంచంలోని అనేక మంది ఫ్యాషన్ నిపుణులను కలిసినట్టు, అనేక ప్రాంతాలు తిరిగామని అన్నారు. అలనాటి లాహోర్ సంస్కతిని తెలియజెప్పే అవకాశమున్న మ్యూజియాలన్నింటిని కూడా సందర్శించామని చెప్పారు. పద్మావత్ కోసం తాము పడిన కష్టాన్ని మెచ్చి, బన్సాలీ మళ్లీ తమను వెతుక్కుంటూ వచ్చారని వివరించారు ఆ జంట.