UPI Payments: ఎస్బీఐ ఖాతాదారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏటీఎంలో డబ్బుల తీసుకోవచ్చు..! అది ఎలాగో తెలుసా..?
ప్రస్తుత కాలంలో ప్రతి లావాదేవీలు డిజిటలైజేషన్ అయిన నేపథ్యంలో అన్ని బ్యాంకులు యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిపేందుకు సుముఖత చూపిస్తున్నాయి. తమ ఖాతాదారులకు సులభతరం, సౌకర్యవంతంగా నగదు చెల్లింపులు చేయించేందుకు తాజాగా ఎస్బీఐ సిద్దం అయ్యింది. ఇది వరకు ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ బ్యాంకింగ్ యాప్ 'యోనో' ను మరింత అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో మీ ముందుకు తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇప్పటి క్యాష్ లెస్ పేమెంట్స్ యుగంలో ప్రతి ఒక్క నగదు లావాదేవీ యూపీఐ, క్యూ ఆర్ కోడ్ ద్వారా జరుగుతుంది. అందుకే దీనికి అనుగుణంగా తమ ‘యోనో’ యాప్ ను అప్డేట్ చేసింది. స్కాన్ చేసి లేదా నంబర్ చెబితే డబ్బులు పంపించేందుకు వీలుగా ఉండేలా సరికొత్తగా రూపొందించింది. అలాగే రిక్వెస్ట్ మనీ లాంటి యూపీఐ సదుపాయాలను కూడా తీసుకువచ్చింది. 2017లో కొత్తగా ఎస్బీఐ ఖాతాదారులకు పరిచయం చేసిన ఈ ‘యోనో’ యాప్ కు ప్రస్తుతం 6 కోట్లకు పైగా యూజర్లు ఉండటం గమనార్హం. 2022 – 23 సంవత్సరానికి గానూ ఈ యాప్ ద్వారా దాదాపు 80 లక్షల మంది ఈ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు.
తాజాగా తీసుకొచ్చిన ఫీచర్స్ ఈ యాప్ ఉపయోగిస్తున్న వారికి మెరుగైన సేవలు లభిస్తాయని అంటున్నారు. 68వ బ్యాంక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఐసీసీడబ్ల్యూ సదుపాయాన్ని తీసుకొని వచ్చారు. ఐసీసీడబ్య్లూ అంటే (ఇంటర్ ఆపరబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాల్) అని అర్థం. ఈ టెక్నాలజీతో నడిచే ఏ ఏటీఎంల నుంచి అయినా డెబిట్ కార్డ్ లేకుండా నగదు తీసుకోవచ్చు అంటున్నారు. అది కూడా యూపీఐ క్యూఆర్ క్యాష్ ద్వారా తీసుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది.
T.V.SRIKAR