Super Fast Internet: అత్యంత వేగంగా ఇంటర్నెట్ అందించే సరికొత్త సాధనం తారా.. అందుబాటులోకి ఎప్పుడంటే..?

నేటి ప్రపంచాన్ని ఇంటర్ నెట్ అనే తరంగాలు బంధించేశాయి. ఇవి లేకుండా నిమిషం కాదు కదా క్షణం కూడా గడవని పరిస్థితి. ఇలాంటి తరుణంలో మరింత వేగంగా ఇంటర్నెట్ ను అందించేందుకు సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 2, 2023 | 01:38 PMLast Updated on: Sep 02, 2023 | 1:38 PM

A New Tool That Provides The Fastest Wi Fi Tara Nu Will Be Available

సాధారణంగా మనకు ఇంటర్నెట్ కావాలంటే పెద్ద పెద్ద నెట్వర్క్ టవర్లను ఏర్పాటు చేసి వాటికి గుండ్రని గోళాలను అమర్చి సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందిస్తారు. అయితే ఇది అధిక ఖర్చుతో పాటూ వ్యయాప్రయాసలతో కూడుకున్న పని. పైగా ఈ టవర్లను ఎవరి ఇంటిపైన ఉంచినా వారికి నెల వారి అద్దెను చెల్లించాలి. వాళ్లు ఎప్పుడు తొలగించమిని చెబితే అప్పుడు తీసేసేందుకు సిద్దంగా ఉండాలి. ఇన్ని పర్యావసానాల మధ్య సరికొత్త ఇంటర్నెట్ సాధనాన్ని తీసుకొచ్చారు. దీని పేరే తారా. దీనిని గూగుల్ కి మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ రూపొందిస్తే, ఎయిర్ టెల్ భాగస్వామ్యం అందిస్తోంది. లేజర్ బీమ్ తో ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. లేజర్ బీమ్ అంటే సిగ్నల్ డౌన్ లేని అత్యంత వేగవంతమైన డేటా అందించడం అని అర్థం.

తారా వెనుక అసలు కథ ఇదే..

ఆకాశంలో పెద్ద పెద్ద బెలూన్లను ఎగురవేసి వాటి ద్వారా ఇంటన్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. గగనంపై రంగురంగుల బెలూన్లు చూసేందుకు నక్షత్రాల్లాగా కనిపిస్తాయి కనుక దీనికి తారా అని పేరు పెట్టారు. అయితే ఏడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ అధిక ఖర్చుతోపాటూ ఇతరత్రా సమస్యల కారణంగా దీనిని పక్కన పెట్టారు. అలా సుదీర్గమైన ఆలోచనలు, సంప్రదింపులు, ప్రయోగాల తరువాత ఒక పరికరాన్ని కనుగొన్నారు. అవి మన రోడ్లపై కూడళ్ళలో ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ ఆకారాన్ని పోలి ఉంటాయి. ఈ యంత్రాలను ఎక్కడైతే ఇంటర్నెట్ సేవలు అవసరమో అక్కడ విద్యుత్ స్తంభాలకు లేదా ఇంటి చుట్టుపక్కల అమరుస్తారు.

ప్రత్యేకతలు అదుర్స్..

  • దీనిని తయారు చేసేందుకు తక్కువ ఖర్చుతో పాటూ సమయం వృధా కాదు.
  • ఎలాంటి ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ అవసరం లేదు.
  • పూర్తి లేజర్ కిరణాల సహాయంతో నడుస్తాయి.
  • అంతరాయం లేని నిరంతరం హైస్పీడ్ డేటా.
  • సెకనుకు 20 గిగా బైట్ వేగంతో సిగ్నళ్లను అందిస్తుంది.
  • అతి సులువుగా ఎక్కడైనా అమర్చే వెసులుబాటు కలిగి ఉంది.

అమలులో ఉన్న దేశాలు..

ఈ లేజర్ సిగ్నలింగ్ విధానం ద్వారా ఇంటన్నెట్ సేవలను అందిపుచ్చుకునే దేశాలు డజనుకు పైగా ఉన్నాయి. కెన్యా, ఆస్ట్రేలియా, ఫిజీ, కాంగోతో పాటూ మరికొన్ని దేశాలు వీటి ద్వారా అంతరాయం లేని ఇంటర్నెట్ ను పొందుతున్నాయి. మన దేశంలోకి కూడా వీటిని తీసుకొని వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రభుత్వాల అనుమతులు అవసరం లేదు..

ఇంటర్నెట్ అందించాలంటే మనం సాధారణంగా ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో భూమిని తవ్వాలి. ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ భూగర్భంలో నుంచి తీసుకురావాలి. అలాగే ప్రభుత్వాల నుంచి రకరకాల అనుమతులు తీసుకోవాలి. తవ్విన వాటిని పూడ్చేందుకు అయ్యే ఖర్చును కూడా ఈ ఇంటర్నెట్ కంపెనీలే భరించాలి. అలా కాకుండా కేవలం ఒక పరికరాన్ని సింపుల్ గా ఎక్కడ అవసరం అయితే అక్కడ అమర్చి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎంతగానో తోర్పడుతుంది.

భాగస్వామ్య పెట్టుబడుల వివరాలు

గతంలో గూగుల్ ఒక కీలకమైన విషయాన్ని ప్రకటించింది. మన దేశంలో డిజిటల్ టెక్నాలజీ సేవలను అందించడంలో భాగంగా 10 బిలియన్ డాలర్లు అంటే రూ. 82 వేల కోట్లను ఖర్చు చేసేందుకు సిద్దమైంది. అందులో భాగంగానే ఈ తారా ప్రాజెక్ట్ కోసం భారతీ ఎయిర్ టెల్ ఈ సంస్థతో చేతులు కలిపింది. ఇప్పటిక భారీగా పెట్టుబడులు పెట్టింది. ఫైబర్ కేబుల్ లేని ప్రాంతాల్లో ఈ తారా ద్వారా తన ఇంటర్నెట్ సేవలను వినియోగదారులకు అందింది తన విస్తృతిని పెంచుకోవాలని భావించింది. అందుకే 700 మిలియన్ డాలర్లు అంటే రూ. 5750 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇందులో భాగంగానే భారత దేశంలోనే మొట్టమొదటి వెయిర్ లెస్ రూటర్ ని గతంలో భారతీ ఎయిర్ టెల్ పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే. దీనిని బట్టి రానున్న రోజుల్లో మన దేశంలో అత్యంత వేగవంతమైన డేటాకు కొరతలేదని చెప్పవచ్చు.

T.V.SRIKAR