UPI Payments: హలో యూపీఐ అంటే చాలు.. మాట్లాడుతూ పేమెంట్స్ చేసేయోచ్చు
వాయిస్ ఆధారంగా యూపీఐ పేమెంట్స్ చేసే సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

A new voice-based UPI payment feature is now available
నేటి యుగంలో ఏం కొన్నా ఆన్లైన్ లోనే, ఎంత పేమెంట్ చేసినా ఆన్లైన్లోనే అన్న విధంగా పరిస్థితి తయారైంది. నాటి కార్డ్ పేమెంట్స్ మొదలు నేటి క్యూఆర్ కోడ్ చెల్లింపుల వరకూ అన్నీ డిజిటల్ అయిపోయాయి. అయితే వీటన్నింటికీ ప్రాసెస్ కొంచెం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. దీనిని మనం చేత్తో చేస్తూ ఉంటాం. అయితే తాజాగా యూపీఐ పేమెంట్స్ ని వాయిస్ ఆధారంగా కూడా చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెసులుబాటు కల్పిస్తోంది. గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ సందర్భంగా ఈ సరికొత్త చెల్లింపుల విధానాన్ని ఆవిష్కరించింది.
ఇందులో హలో యూపీఐ అనే వాయిస్ ఆధారిత ఆప్షన్ తో యాప్స్, టెలి కాల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం దీనిని హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ఇతరు ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎన్ పీ సీ ఐ అధికారులు తెలిపారు. అలాగే బ్యాంకులు మంజూరు చేసిన క్రెడిట్ లైన్ అనే సేవలను కూడా వినియోగించుకొని ఆఫ్ లైన్ ద్వారా నగదు చెల్లింపులు జరుపవచ్చని పేర్కొంది. గతంలో తీసుకొచ్చిన యూపీఐ లైట్ ఎక్స్ ఫీచర్ ద్వారా డబ్బులు ఆఫ్ లైన్లో పంపించేందుకు వెసులుబాటు ఉంటుంది. ట్యాప్ అండ్ పే తో కూడా క్షణాల్లో డబ్బులు పంపించవచ్చు. మనం ఎక్కడున్నా క్యూఆర్ కోడ్ ఫోటో పంపితే దానిని ట్యాప్ చేసి నగదు చెల్లింపులు చేసేలా యూపీఐ పేమెంట్స్ ని అభివృద్ది చేసినట్లు వివరించారు.
దీనిని బట్టి అర్థమైంది ఏమిటంటే గతంలో పేమెంట్ చేసే డివైజ్ కి ఇంటర్నెట్ ఉంటేనే నగదు లావాదేవీలు జరిగేందుకు వీలుండేది. అయితే తాజాగా తీసుకొచ్చిన విధానాల ద్వారా ఇంటర్నెట్ అవసరం లేకుండానే డబ్బులు ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయవచ్చు. అది కూడా మన నోటి మాటలతో.
T.V.SRIKAR