Pakistan Women: బాబర్ బచ్చాగాడు.. విరాట్ కోసం దేనికైనా రెడీ
పాకిస్తాన్ నుంచి వచ్చిన యువతి విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్ చేశారు.

A Pakistani young woman expressed her opinion on Virat Kohli during the match held in Colombo
క్రికెట్ ప్రపంచంలో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కు ఎంతో క్రేజ్ ఉంటుంది. రెండు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీవీలకు అత్తుకుపోతుంటారు. మరికొంత మంది స్టేడియానికి వచ్చి తమ అభిమాన ప్లేయర్ల ఆట చూస్తూ మురిసిపోతుంటారు. అయితే పాకిస్తాన్‌కు చెందిన ఓ యువతి, ఇండియన్ స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్‌గా మారింది. విరాట్ ఆట చూడటానికి శ్రీలంకకు వచ్చినట్లు ఆమె చేసిన వ్యాఖ్యలు, అందుకు సంబంధించిన వీడియో ఒకటి X ప్లాట్‌ఫామ్‌లో వైరల్‌గా మారింది. సెంచరీల మీద సెంచరీలు కొట్టే కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దాయాది దేశం పాక్ అందుకు మినహాయింపు ఏమీ కాదు. అక్కడ కూడా కోహ్లీకి చాలా మంది అభిమానులు ఉన్నారు.
తాజాగా ఆసియా కప్‌లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ చూసేందుకు శ్రీలంకకు వచ్చిన ఓ యువతి.. తన అభిమాన క్రికెటర్ కోహ్లీ అని చెప్పింది. అతడి కోసమే స్టేడియానికి వచ్చానని వెల్లడించింది. ‘నేను విరాట్ కోహ్లీ కోసమే వచ్చాను. అతడు సెంచరీ చేస్తాడు అనుకున్నాను. అయితే త్వరగా అవుట్ కావడంతో నా గుండె బద్దలైంది.’ అని సదరు యువతి చెప్పుకొచ్చింది.