Prabhas: కల్కి ఫోటో లీక్.. యెవరి కుట్ర ఇది?
ప్రభాస్ కల్కి సినిమా నుంచి ఫోటో లీక్ అయింది.

A photo from the film Kalki, which is being made in the direction of Naga Ashwin starring Prabhas as the hero, has been leaked
కల్కీ సినిమా డైరెక్టర్ నాగ అశ్విన్ చేయి దాటిపోయింది. రెండేళ్లపాటు ఒక్క లీక్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాడు. రీసెంట్‌గా ఈ పాన్ వరల్డ్ మూవీ నుంచి ఫొటో లీకైంది. ఎంత జాగ్రత్తగా వున్నా.. ఈ ఫొటో బైటకొచ్చింది. మహానటి తర్వాత నాగి అద్భుతమైన సినిమా తీస్తున్నాడని.. బడ్జెట్తో సంబంధం లేదని నిర్మాత అశ్వనీదత్ చెబుతూ వచ్చారు. దీనికి తగ్గట్టే గ్లిమ్స్ హాలీవుడ్ మూవీని గుర్తుచేసింది. ఇండియాలో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా 600 కోట్లతో రూపొందుతోంది. మొదట్నుంచీ లీకేజ్ లేకుండా జాగ్రత్తపడినా.. చివరికి విఎఫ్‌ఎక్స్ సంస్థ నుంచి ప్రభాస్ స్టిల్ నెట్‌లోకి వచ్చేసింది.
బాహుబలి.. ఆర్‌ఆర్‌ఆర్.. సలార్ వంటి పెద్ద సినిమాలకు లీకేజ్ తప్పలేదు. కానీ కల్కి విషయంలో దర్శక నిర్మాతలు చాలా కేర్‌ఫుల్‌గా వున్నారు. వాళ్లు పోస్టర్స్ ఇచ్చేవరకు ఒక్క స్టిల్ కూడా బైటకి రాలేదు. వీళ్ల చేతుల్లో వుండగా అంతా బాగానే వున్నా.. విఎఫ్‌ఎక్స్ సంస్థలోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచే ప్రభాస్ స్టిల్ లీకైంది. మున్ముందు కల్కీ నుంచి ఏదీ లీక్ కాకుండా.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. 2024 సంక్రాంతికి రావాల్సిన కల్కి గ్రాఫిక్స్ వర్క్ లేటవడంతో వాయిదాపడింది. అదేమిటోగానీ.. ప్రభాస్ సినిమాలన్నీ విఎఫ్‌ఎక్స్ ఆలస్యం కారణంగా వాయిదాపడుతున్నాయి. ఆదిపురుష్ ఎఫెక్ట్స్ ట్రోలింగ్ కావడంతో.. రిలీజ్ వాయిదా వేశారు. ఇదే కారణంగా ఈనెల 28 రావాల్సిన సలార్ పోస్ట్ పోన్ అయింది.